DailyDose

హైదరాబాద్-విజయవాడ మధ్య బులెట్ ట్రైన్ నడపాలి-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Hyd-Vja Bullet Train

*2014 ఏపీ విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఉంది. రైల్ కోచ్ ప్యాక్టరీ కట్టాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటె స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
* సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ధర్నా చౌక్ కు చేరుకున్న టీచర్లు… అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే కొందరు టీచర్లు పోలీస్ వాహనాల నుంచి కిందికి దిగి ఆందోళన చేశారు. పీఆర్సీని ప్రకటించి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
*శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుక‌ల‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ 2న‌ భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం స‌కాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
*రాష్ట్రంలో పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ దుయ్యబట్టారు. ప్రత్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేస్తున్నారని, సీఎం 90శాతం సీట్లు సాధించాలని చెప్పడం వల్లే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన నది- మన నుడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. నదుల పరిరక్షణ, తెలుగు భాషకు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
*మధ్యప్రదేశ్‌ గవర్నర్ లాల్జీ టాండన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సిఫారసు మేరకు మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులపై గవర్నర్ బహిష్కరణ వేటు వేశారు. మంత్రివర్గం నుంచి తొలగించారు. వీరంతా కమల్‌నాథ్‌కు ఏమాత్రం అందుబాటులో లేకుండా బెంగళూరుకు తరలివెళ్లిన మంత్రులే కావడం విశేషం
*కాంగ్రెస్ కు చెందిన 19 మంది రెబెల్ ఎమ్మెల్యేలు శుక్రవారం భోపాల్ కు చేరుకున్నారు. వీరితో పాటు ఆరుగురు కేబినెట్ మంత్రులు కూడా బెంగళూరు రిసార్ట్స్ నుంచి భోపాల్ కు చేరుకున్నారు. అయితే భోపాల్ విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.
*ఏన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తూ, దీనిని 2010 పద్ధతిలోనే జరపాలన్న డిమాండ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారంనాడు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తాము అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పందించలేదంటూ తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ఆ రాష్ట్రంలో ఎన్‌పీఆర్ ప్రక్రియను నిలిపివేసిన మరుసటి రోజే ఢిల్లీలోని ఆప్ సర్కార్ తాజా నిర్ణయం తీసుకోవడం విశేషం.
*టీడీపీ కార్యకర్తలు రెచ్చియారు. శుక్రవారం విజయవాడ ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నామినేషన్లు వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని వారు తెలిపారు.
*ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు ఆరో వార్డు అభ్యర్థి ఓబుల దాసు వద్ద నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు 28 వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రమీల వద్ద నుంచి నామినేషన్లు లాక్కొని చించివేశారు ఈ దశలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది
*మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ సందర్భముగా *గుంటూరు రురల్ ఎస్పీ శ్రీ సిహెచ్. విజయరావు ఐపిఎస్ తెనాలి మున్సిపాలిటీ కార్యాలయమును సందర్శించి అచ్చట ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
*మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లాను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఆయ‌న్ను గృహ‌నిర్భంధంలో ఉంచిన విష‌యం తెలిసిందే. గృహ‌నిర్బంధం ఆదేశాల‌ను ర‌ద్దు చేస్తూ ఇవాళ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు రిలీజ్ చేసింది.
*ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. అతని సోదరుడు అతుల్‌ సింగార్‌కు కూడా ఇదే విధమైన శిక్షను విధించింది. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కుల్‌దీప్‌సింగ్‌ సెంగార్‌, అతని సోదరుడిని కోర్టు ఆదేశించింది.
*ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 28 నుంచి జరగనున్నాయి. 30న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు.
*స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలంటూ సీసీ కెమెరా దృశ్యాలు విడుదల చేసిన తెదేపా.తెనాలి 4వ వార్డు తెదేపా అభ్యర్థి ఇంట్లోకి అర్ధరాత్రి దుండగులు ప్రవేశించారన్న తెదేపా.ఇంట్లోని వాటర్ ట్యాంక్ వద్ద మద్యం సీసాలు పెట్టి ఉడాయించారన్న తెదేపాఉదయాన్నే అభ్యర్థి ఇంటికి చేరుకుని ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసినట్లు వెల్లడి.
* నల్లమల అటవీప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ… ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
* కర్నూలు టీడీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్.పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె ఈ ప్రభాకర్.
టీడీపీ పార్టీకి మనుగడ లేదు.కనీసం నేను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో టిడిపి పార్టీ ఉంది.ఓ బిజెపి నాయకుని మాట టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నాడు.త్వరలోనే ఏ పార్టీ లో చెరబోయేది ప్రకటిస్తాను.
* ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 28 నుంచి జరగనున్నాయి. 30న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 31న ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెడతారు.
* కర్నూలు టీడీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్.పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె ఈ ప్రభాకర్.
టీడీపీ పార్టీకి మనుగడ లేదు.కనీసం నేను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో టిడిపి పార్టీ ఉంది.ఓ బిజెపి నాయకుని మాట టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నాడు.త్వరలోనే ఏ పార్టీ లో చెరబోయేది ప్రకటిస్తాను.
* ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ యువకుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. మరో 14 మంది అనుమానితులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 3 ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను వైద్యులు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా నగరంలో సినిమా థియేటర్లను మూసివేశారు.
* ఉత్తరప్రదేశ్‌లో 11 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఆగ్రాలో ఏడుగురికి, ఘజియాబాద్‌లో ఇద్దరికి, నోయిడా, లక్నోలో ఒక్కొక్కరికి కరోనా వ్యాధి సోకినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌, కాలేజీలు, టెక్నికల్‌, వొకేషనల్‌ విద్యాసంస్థలకు ఈ నెల 22 వరకు సెలవులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మార్చి 22 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం ప్రకటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు కొనసాగుతాయని.. ఇంకా ప్రారంభం కానీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
* అమెరికా-తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందానికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో అమెరికా ప్రతినిధి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులుగా ఉన్న మొత్తం 15 దేశాలూ ఈ ఒప్పందానికి ఏకగ్రీవంగా సమ్మతి తెలిపాయి.
*కర్నూలు జిల్లాలోని ఓ పార్టీ ప్రజాప్రతినిధి స్థానిక సంస్థల పదవులకు రాయ‘బేరాలు’ సాగిస్తున్నారని తెలుస్తోంది. తమ పార్టీ తరఫున ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు కావాలంటే ఒక్కో పదవికి రూ.కోటి ఇవ్వాలని డిమాండు చేసినట్లు సమాచారం. కొందరు వెనక్కు తగ్గగా, కొన్ని స్థానాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఓ ఎంపీపీ పదవిపై ఒకరు రూ.50 లక్షలు, మరొకరు రూ.80 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా చివరకు రూ.కోటి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న వ్యక్తికి బీ-ఫారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.
*కర్నూలు జిల్లాలో ఓ ఎంపీపీ స్థానానికి మంచి గిరాకీ ఏర్పడింది. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన ఓ పార్టీ ప్రజానిధి బేరానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి చెల్లించేందుకు అంగీకరించిన వ్యక్తికి బీ-ఫారం ఇచ్చేందుకు సమ్మతించినట్లు సమాచారం.
*అంతర్జాతీయ విమానాశ్రయంలో 60-70 మంది విద్యార్థులం 24 గంటల నుంచి బిక్కుబిక్కుమంటున్నాం. కోవిడ్‌-19 నెగెటివ్‌ సర్టిఫికేట్‌ సమర్పిస్తేనే విమానంలోకి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు. ఈ సర్టిఫికేట్‌ ఎవరిస్తారో ఇక్కడి భారత ఎంబసీ అధికారులకు కూడా తెలియడం లేదు. మాకు ఇక్కడ భోజనంతో పాటు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇటలీ అంతా బంద్‌ కావడంతో బయట కూడా ఆహారం అందుబాటులో లేదు. మాకు మెడికల్‌ సర్టిఫికేట్‌ లేకుండానే స్వదేశానికి వచ్చేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.
*ఉగాదికి పేదలకు మంజూరు చేయనున్న ఇళ్ల స్థలాల కోసం భూముల అన్వేషణలో రెవెన్యూ, సర్వే యంత్రాంగం నిమగ్నమవ్వడంతో రీ సర్వే పైలెట్‌ ప్రాజెక్టు దాదాపుగా నిలిచిపోయినట్లు తెలిసింది. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభా్‌షచంద్రబోస్‌ ఫిబ్రవరి 18న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో పైలెట్‌ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. రీ సర్వే అంశంతోపాటు పైలెట్‌ ప్రాజెక్టుపై శుక్రవారం ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లాం వద్ద సమీక్ష జరగనుంది.
*రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్‌లైన్‌ నంబర్లు అందుబాటులో ఉంచారు. తెలంగాణలో హెల్ప్‌లైన్‌ నంబరు 104, ఏపీలో 0866 2410978, సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 011 23978046 ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
*నేటితో ముగియనున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయితీల్లో నామినేషన్లు గడువు.ఉదయం 11 గంటలు నుంచి 3 గంటలు లోపు నామినేషన్లు సమయం.రెండవ రోజు నామినేషన్ లు గడువు ముగిసే సమయానికి ఎన్నికలు జరుగుతున్న 12 నగర కార్పొరేషన్ లలో 1383 నామినేషన్ లు దాఖలు.75 మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో 1997 నామినేషన్లు దాఖలు అయ్యాయి.రేపు కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో దాఖలైన నామినేషన్ లు పరిశీలన.రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల దాఖలు లో దూసుకుపోతున్న వైసీపీ.ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థులు కు అభ్యర్థులు కరువు, కొన్నిస్థానాల్లో వర్గ పొరుతో సతమతం అవుతున్న టీడీపీ.కొన్నిస్థానాల్లో కోస్తా జిల్లాల్లో టిడిపి-జనసేన అభ్యర్థులు చీకటి ఒప్పందం నామినేషన్లు సమయంలో బుట్టదాఖలు.మిత్ర పక్షం బిజెపి కి స్థానిక ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తున్న జనసేన,
టీడీపీ బలంగా ఉన్న చోట్ల జనసేన పోటీ కి దూరంగా జనసేన…
*ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఈ నెల 13వ తేదీన తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా రాష్ట్రవ్యాప్తంగా గురువారం వందలాది మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ పోలీసులు వారికి మూడు నాలుగు రోజులుగా ఫోన్లు చేస్తూ, బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు.
*ఇందిరమ్మ గృహాలపై రెవెన్యూశాఖ పరిశీలన పూర్తయిన తరువాత.. అసంపూర్తిగా ఉన్నవాటికి నిధులు మంజూరు చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిర్మాణాలు మొదలై తుదిదశలో నిలిచిపోయిన గృహాలను పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహాలపై పంచాయతీల వారీగా రెవెన్యూ సర్వే చేపట్టగా 4.68 లక్షల గృహాల్లో 1.38 లక్షల గృహాలు బోగస్గా తేలాయన్నారు. మరో 69,630 గృహాలపై సర్వే కొనసాగుతోందని చెప్పారు.
*ఆర్టీసీ కార్మికులకు ఎదురవుతున్న సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే సంబంధిత అధికారులు సమాధానమివ్వడం లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ వరాలిస్తే.. కొందరు అధికారులు కక్షపూరితంగా బలవంతపు బదిలీలు చేస్తున్నారన్నారు. దీనిపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ఈ పరిస్థితులు పునరావృతం కానివ్వబోమని, ప్రజాప్రతినిధుల ఫోన్లకు అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు.
*జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్రావు ప్రతిష్ఠాత్మక ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషిచేసిన వారికి రెండేళ్లకోసారి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం (ఆర్ఐసీఏఆర్ఈఏ), నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నాయి
*సమస్యల పరిష్కారానికి సంస్థలోని ఉద్యోగులు చేసిన 55 రోజుల నిరవధిక సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా పరిగణిస్తున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబరు అయిదో తేదీ నుంచి నవంబరు 28వ తేదీ వరకు ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే.
*హైదరాబాద్ ఫార్మా సిటీ ఏర్పాటుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనకు పర్యావరణ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన ఫార్మా సిటీ ఏర్పాటు చేసి ఒకేచోట వేలాది ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వలన వందలాది గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయని తెలిపారు. దీనికి అనుమతులపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరుగురు ఆదివాసీల అదృశ్యంపై గురువారం ఉదయానికి కొన్ని పరిణామాలు జరిగాయి. పోలీసుల నిర్బంధంలో ఉన్నట్టు గ్రామస్థులు చెబుతున్న ఆరుగురు ఆదివాసీల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన నలుగురిని విడిచిపెట్టినట్టు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి వచ్చిన నలుగురు ఛత్తీస్గడ్ వాసులతో పాటు గ్రామానికి చెందిన ఇద్దరిని స్థానిక పోలీసులు సోమవారం రాత్రి తీసుకెళ్లారనేది ఆ గ్రామస్థుల ఆరోపణ. దీన్ని పోలీసులు ఖండిస్తున్నారు.
*రాష్ట్రంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి పథకం(సీడీపీ) తుది విడత నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ కింద రూ.92.9 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులు కొత్త పనుల కోసం కాదని గతంలో మంజూరు చేసి పూర్తయిన వాటికి వినియోగించాలని ఆర్థిక, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
*బేగంపేటలో జరుగుతున్న అంతర్జాతీయ విమానప్రదర్శన ‘వింగ్స్ఇండియా-2020’పై కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రభావం చూపింది. రెండేళ్లకోసారి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రదర్శనలో ఈ ఏడాది తక్కువ సంస్థలే పాల్గొన్నాయి. విదేశాల నుంచి రావాల్సిన ప్రధాన కంపెనీలు, మంత్రులు గైర్హాజరయ్యారు. ప్రవేశ ద్వారం వద్ద స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఏ మాత్రం అనారోగ్య లక్షణాలున్నా, శరీర ఉష్ణోగ్రతలో మార్పులున్నా అందుబాటులో ఉన్న వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ముఖానికి మాస్క్లు ధరించమని సూచిస్తున్నారు. తొలిరోజు ప్రదర్శనలో స్టాల్స్ వెలవెలబోయాయి. వైరస్ భయంతో సాధారణ సందర్శకులను అనుమతించటం లేదని నిర్వాహకులు తెలిపారు.
*వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కుసుమ నూనె ఉత్పత్తి చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి అనుమతి లభించింది. ఈ మేరకు ఫుడ్సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) బుధవారం లైసెన్స్ జారీ చేసింది. కార్తా గోల్డ్ పేరిట నూనెను విక్రయించేందుకు పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
*సింగరేణి బొగ్గు గనులకు రావాల్సిన బకాయిలు జనవరి నాటికి రూ.4,061 కోట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మొత్తం బకాయిల్లో దాదాపు సగం తెలంగాణ జెన్కోనుంచే రావాల్సి ఉన్నట్లు బొగ్గు వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం గురువారం సమర్పించిన నివేదికలో పేర్కొంది. మొత్తం బకాయిల్లో ఏపీ జెన్కోవాటా దాదాపు 15% మేర ఉంది. ఈ బకాయిలు రాబట్టుకోడానికి సింగరేణి కాలరీస్ సంబంధిత విద్యుత్తు సంస్థల సీఎండీలకు ఎప్పటికప్పుడు లేఖలురాస్తూ వస్తున్నట్లు స్థాయీసంఘం పేర్కొంది
*రైల్వే అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) దేశ, విదేశాలకు తలపెట్టిన యాత్రలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. అయిదు రోజుల శ్రీలంక యాత్రను రద్దు చేస్తూ ఈ సంస్థ తాజాగా నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తలపెట్టిన సింగపూర్, మారిషస్, బాలి, మలేసియా, యూరప్ ఖండంలోని వివిధ దేశాల యాత్రలను కూడా ఉపసంహరించే యోచనలో ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీలంకకు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో రామాయణ యాత్రకు బుకింగ్ పూర్తయ్యింది.
*ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ముఖ్యంగా ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులు, పోలీసులపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మాచర్లలో వైకాపా నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది కిశోర్ను ఆయన గురువారం పరామర్శించారు.
* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో రాకెట్ ప్రయోగాలు, అనుసంధాన కార్యక్రమాలపై కరోనా ప్రభావం పడింది. అక్కడ రాకెట్ అనుసంధాన పనులన్నీ నిలిచిపోయాయి. ఇస్రో కేంద్ర కార్యాలయం నుంచి అందిన ఉత్తర్వుల మేరకే వాటిని ఆపేసినట్లు సమాచారం. షార్లో ప్రస్తుతం పొలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్- సి49, సీ50 వాహకనౌకల అనుసంధాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
*జగనన్న విద్యా కానుక కిట్ కొనుగోలుకు పరిపాలన అనుమతినిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. కిట్ కింద ఒక్కోవిద్యార్థికి 3 జతల ఏకరూప దుస్తులు, పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, 2 జతల సాక్సు, బెల్టు, స్కూల్ బ్యాగ్ అందించనున్నారు. ఇందుకు అవసరమయ్యే రూ.655.60కోట్లలో ఛ్ఘ్ 60% వాటాగా రూ.393.36కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.262.24కోట్లు భరించనున్నాయి.
*తెదేపా అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకునేందుకు.. అధికారులు, పోలీసుల అండతో వైకాపా నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యం చేసిన 172 ఘటనలపై సాక్ష్యాధారాలతో ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్కు తెదేపా ఫిర్యాదు చేసింది. తెదేపా ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, దీపక్రెడ్డి ఫిర్యాదు అందజేశారు. ఈసీ ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే ఎన్నికలు బహిష్కరించే ఆలోచన చేస్తామన్నారు.
*భారతదేశంలోని పర్యాటక, పుణ్యక్షేత్రాలను సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం మే 8న భారత్దర్శన్ పేరుతో ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఐ.ఆర్.సి.టి.సి ఏజీఎం సంజీవయ్య తెలిపారు. గురువారం విజయవాడ రైల్వేస్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. మొత్తం 11రోజులు ఉండే ఈ యాత్రలో.. రైలు మే 8న బ్రహ్మపూర్లో బయలుదేరి విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుచిరాపల్లి చేరుకుంటుంది.
*రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్మార్ట్ టీవీల కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి రూ.200, పాఠశాలకు రూ.1500 విలువ చేసే కిట్లు, వర్క్బుక్లు, ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్లను అందించనున్నారు.