Devotional

నటరాజు తాండవ రహస్యం

The secret behind nataraja tandavam

1. నటరాజు ఎందుకు తాండవమాడాడంటే! – ఆద్యాత్మిక వార్తలు -13/03
పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది.సప్త సారస్వతమనే పుణ్యభూమి ఉంది. అక్కడ తపస్సు చేస్తే శివజ్ఞానం కలుగుతుందని తెలుసుకున్న మంకణమహాముని అక్కడకు వెళ్లి తపోనిష్ఠలో మునిగిపోయాడు. నిరంతర పంచాక్షరీ జపంతో అతని శరీరం మహా తేజస్సుతో వెలిగిపోసాగింది. భక్తి పారవశ్యంతో ఆయన తాండవం చేయడం ప్రారంభించాడు. అతని తపోశక్తికి మెచ్చుకుని శివుడు మంకణ మహర్షి ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ తాండవలో మునిగిపోయి ఉన్న మంకణుడు శివుడి రాకను గుర్తించలేదు. శివుడు ఆ మహర్షిని ఆపడానికి ప్రయత్నిస్తూ నీ తపస్సు, తాండవం, తపనా ఎవరికోసమని ప్రశ్నించాడు. దానికీ సమాధానం లేదు. దీంతో పరమ శివుడు ఉగ్రుడయ్యాడు. తేజోమూర్తిగా మారి మహాతాండవం చేయడం ప్రారంభించాడు. ఆయనతో పాటు ఆ తాండవంలో ఓ స్త్రీకూడా ఉంది. శివుడి మహా తాండవం ముందు మంకణుడి నాట్యం వెలవెలబోయింది. దీంతోపాటు మంకణ ముని అహంకారం కూడా తొలగిపోయింది. పరమేశ్వరుడి ముందు సాగిలపడి క్షమించమని కోరారాయన. అప్పుడు పరమశివుడు ‘సర్వప్రాణుల్లో ఉన్న జీవాత్మను నేనే. నాతోపాటు మహా తాండవంలో కనిపించిన దేవి ప్రకృతి. లింగరూపుడినైనా, అర్ధనారీశ్వరుడినైనా, మహాతాండవం చేసిన నటరాజునైనా నేనే’ అన్నాడు. అలా నీలకంఠుడు నటరాజు అవతరాన్ని ధరించాడు.
2.శ్రీవారి దర్శనం, బస తేదీల్లో మార్పులకు అవకాశం
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా తిరుమల యాత్రను వాయిదా వేసుకునే భక్తుల సౌకర్యార్థం తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్లో మే 31వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 టికెట్పై ప్రత్యేక ప్రవేశ దర్శనం, ముందస్తుగా గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. రద్దు చేసుకుంటే నగదును తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం తిరుమలలోని గోకులం మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం తేదీలు మార్చుకునేందుకు dyeotemple@gmail.com అనే ఈ-మెయిల్కు వివరాలు పంపాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు, విదేశీయులు 28 రోజుల పాటు తిరుమలకు రావొద్దని ఇటీవలే దేవస్థానం విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటికే విదేశాల్లో ఉన్న భక్తులు ఆన్లైన్లో ఆర్జిత సేవలను బుక్ చేసుకొని ఉంటే.. వారు పై ఈ-మెయిల్ను సంప్రదించాలని సూచించారు. తితిదే కాల్సెంటర్ను సంప్రదించినా అవసరమైన సమాచారం అందించాలని అధికారులకు ధర్మారెడ్డి సూచించారు.
3.వైభవంగా శివ కల్యాణంవైభవంగా శివ కల్యాణం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శివాలయాల్లో శివరాత్రి రోజునే ఈ కల్యాణాన్ని నిర్వహిస్తారు. వేములవాడలో మాత్రం మహా శివరాత్రి ముగిశాక కామదహనం అనంతరం జరపడం ఆనవాయితీ. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివ పార్వతుల ఉత్సవమూర్తులను అలంకరించి వేదపండితులు కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివ కల్యాణానికి రాజన్న సిరిసిల్ల జడ్పీ ఛైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ పురపాలక సంఘం ఛైర్పర్సన్ రామతీర్థపు మాధవి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు.
4.శ్రీవారి దర్శనం, బస తేదీల్లో మార్పులకు అవకాశం-తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడి
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా తిరుమల యాత్రను వాయిదా వేసుకునే భక్తుల సౌకర్యార్థం తితిదే పలు నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్లో మే 31వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, రూ.300 టికెట్పై ప్రత్యేక ప్రవేశ దర్శనం, ముందస్తుగా గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. రద్దు చేసుకుంటే నగదును తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం తిరుమలలోని గోకులం మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం తేదీలు మార్చుకునేందుకు dyeotemple@gmail.com అనే ఈ-మెయిల్కు వివరాలు పంపాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు, విదేశీయులు 28 రోజుల పాటు తిరుమలకు రావొద్దని ఇటీవలే దేవస్థానం విజ్ఞప్తి చేసింది.సామాన్యులకు అందుబాటులోకి శ్రీవారి జిలేబీలు?
తిరుమల శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవలో నైవేద్యంగా సమర్పించే జిలేబీలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని తితిదే యోచిస్తోంది. ప్రస్తుతం లడ్డూలు, వడల తయారీకే ఆలయంలోని పోటు స్థలం సరిపోతుందని, జిలేబీలు పెద్దయెత్తున చేసి అందించడానికి స్థలాభావం ఉందని కార్మికులు పేర్కొన్నారని తెలిసింది. వీటిని ట్రేలలో తరలించేటప్పుడు ఎక్కువగా విరిగిపోయే ఆస్కారముందని వారు వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సానుకూలంగా స్పందిస్తారని తెలుస్తోంది.
5. ఘనంగా నృసింహుడి ఉత్తర దిగ్యాత్ర
ధర్మపురి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మినరసింహస్వామి వారి ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి(యోగ,ఉగ్ర) వారల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకవచ్చి సాయంత్రం వేళలో సేవలపై ఉంచారు. ఉత్తర దిగ్యాత్రలో భాగంగా ఉత్తరాన ఉన్న ఉసిరిక వాగు వద్దకు సేవలను తీసుకెల్లారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్వామివారల సేవలను ఉంచి వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్చరణల మద్య దిగ్యాత్ర పూజలు చేశారు. ఇక్కడ భక్తులు స్వామివారలను దర్శించుకున్నారు. త్రి వేళలో స్వామివారల సేవలు తిరిగి ఆలయానికి తీసుకవచ్చారు. యాజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల నేతృత్వంలో ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, రమణాచార్య తదితరులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, దేవస్థానం సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, దేవస్థానం సిబ్బంది తదితరులున్నారు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శుక్రవారం సాయంత్రం వేంకటేశ్వర స్వామివారి ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలు, రాత్రి వేళ భోగమండప ఉత్సవం నిర్వహించనున్నారు.
6. కరోనా కట్టడికి తితిదే చర్యలు
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టంది. కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాన్ని తితిదే ఆవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రారంభించారు. అలిపిరి టోల్‌గేట్‌, శ్రీవారిమెట్టు, అలిపిరి కాలినడక ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్యశిబిరాల్లో థర్మల్‌ గన్‌ లు అందుబాటులో ఉంచారు. దగ్గు, జలుబుతో బాధపడే భక్తులకు వైద్య శిబిరంలో చికిత్సలు అందిస్తున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని కల్యాణోత్సవం నిర్వాహణపై తితిదే పునారాలోచనలో పడింది. లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో .. కార్యక్రమం నిర్వహణపై సమీక్షించాలని ఈమేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కల్యాణోత్సవం నిర్వహణపై చర్యలు తీసుకుంటామని తితిదే వెల్లడించింది.
7. పంచాంగము 13.03.2020
వత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: చవితి ప.02:58 వరకు
తదుపరి పంచమి
వారం: శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: స్వాతి రా.07:51 వరకు
తదుపరి విశాఖ
యోగం: వ్యాఘత రా.08:34 వరకు
తదుపరి హర్షణ
కరణం: బాలవ ఉ.08:53 వరకు
తదుపరి తైతిల
వర్జ్యం: రా.1:10 – 02:41
దుర్ముహూర్తం: 08:49 – 09:37
మరియు 12:49 – 01:37
రాహు కాలం: 10:55 – 12:25
గుళిక కాలం: 07:55 – 09:25
యమ గండం: 03:25 – 04:55
అభిజిత్ : 12:01 – 12:49
సూర్యోదయం: 06:25
సూర్యాస్తమయం: 06:25
వైదిక సూర్యోదయం: 06:29
వైదిక సూర్యాస్తమయం: 06:22
చంద్రోదయం: రా.‌10:18
చంద్రాస్తమయం: ఉ.09:16
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: పశ్చిమం
చంద్ర నివాసం: పశ్చిమం
శ్రీ వ్యాసరాయలతీర్థ పుణ్యతిథి
శ్రీసుయతీంధ్రతీర్థ ఆరాధన
8. *చరిత్రలో ఈ రోజు/మార్చి 13*
1733 : ఆక్సిజన్‌ను కనుగొన్న జోసెఫ్ ప్రీస్ట్‌లీ జననం.
1854 : నాటక రచయిత, న్యాయవాది కోలాచలం శ్రీనివాసరావు జననం. (మ.1919)
1889 : హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం.
1911 : అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు శ్రీనివాస చక్రవర్తి జననం. (మ.1976)
1937 : సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం.
1940 : జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడైన మైఖెల్ డయ్యర్‌ను ఉద్దమ్ సింగ్ లండన్‌లో కాల్చిచంపాడు.
1963 : అర్జున అవార్డును ప్రారంభించారు.
9. తిరుమల\|/సమాచారం*
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈరోజు శుక్రవారం,
*13.03.2020*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *17C°-30C°*_
• నిన్న *61,652* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కలిగింది.
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో *11* కంపార్ట్మెంట్ లో భక్తులు సర్వదర్శనం
కొరకు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
ఉచిత దర్శనానికి
సుమారుగా *05*
గంటల సమయం
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.34* కోట్లు,
• నిన్న *14,550* మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
• ₹:10,000/- విరా
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన
సౌకర్యం కలదు.
_*/ / ముఖ్య గమనిక / /*_
• అస్వస్థత కి లోనైన
భక్తులు తిరుమలకి
రావొద్దు,
• విదేశాల నుండి వచ్చిన
వారు 28 రోజుల వరకు
తిరుమల యాత్ర కి
రావొద్దు,
• అలిపిరి, శ్రీవారి మెట్టు
మరియు టోల్ గేట్ వద్ద
భక్తులకు వైద్యపరిక్షలు
నిర్వహిస్తున్నారు,
• అస్వస్థత కి గురైన భక్తుల
యాత్రను రద్దు చేసుకొని
వారి టికెట్టును
*dyeotemple@*
*gmail.com* కి
మెయిల్ చేస్తే మరో రోజుకి
దర్శనం ఏర్పాటు
చేయబడును లేదా
నగదు తిరిగి
చెల్లించబడును.
• భక్తులు సహకరించ
వలసిందిగా ప్రార్థన.
_*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*_
_కౌసల్యా సుప్రజా రామ_
_పూర్వా సంధ్యా ప్రవర్తతే,_
_ఉత్తిష్ఠ నరశార్దూల_
_కర్తవ్యం దైవమాహ్నికమ్‌_
*తా:* _కౌసల్యాదేవికి_
_సుపుత్రుడవగు ఓ_
_రామా! పురుషోత్తమా!_
_తూర్పు తెల్లవారుచున్నది._
_దైవ సంబంధములైన_
_ఆహ్నికములను_
_చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_
*ttd Toll free*
*#18004254141*
10. *విధి*
విధి అంటే బ్రహ్మ, విధి అంటే కర్మ. విధి అంటే నిబంధన, విధి అంటే ఏర్పాటు. స్థితినిబట్టి జీవనగతి, గతినిబట్టి సుగతి ఏర్పడటం, లేక దుర్గతి పాలవటం జరుగుతూ ఉంటుంది. విధి విధానాన్ని అనుసరించి మనిషి జీవితం నడుస్తూ ఉంటుంది. అంతా విధి విధానమే అయితే మనిషి చేయవలసిందిగాని, చేయగలిగింది గాని అంటూ ఏదీ ఉండదు. అహం బ్రహ్మాస్మి అనుకుని కాలం గడిపేయడంతప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటారు కొందరు. విధి లిఖితం, విధి బలీయం అంటూ అన్నీ వదిలేసి చేతులు ముడుచుకుని కూర్చోవడమే పని అయితే మానవ ప్రయత్నానికి విలువేముంది? ఈ ప్రశ్నకు సమాధానం జీవితం ద్వారా రాబట్టుకోవాలి. విధికి తలవంచడమా, దాన్ని తలకెత్తుకోవడమా తేల్చుకోవాలి.ప్రతి మనిషికి జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు తన అస్తిత్వం గురించి ఈ లోకంలో తాను సాధించవలసినదాని గురించి ఓ సంశయం ఎదురుకాక తప్పదు. తాను ఏం చేయాలో, చేయకూడదో, అర్థంకాని సందిగ్ధంలో పడకా తప్పదు. రెండు దారుల కూడలిలో ఎటుపోవాలో ఎరుకలేని బాటసారిలా అవుతాడు. విధికి ఎదురీదడమా లేక ప్రవాహంతోపాటు తేలిపోవడమా అన్న మీమాంస ఎదురుకాక తప్పదు.మహాభారత సంగ్రామంలో అర్జునుడు ఇలాంటి పరిస్థితినే చవిచూడవలసి వచ్చింది. ఒక మనిషిగా తనవారిని, గురువులను, బంధువులను, స్నేహితులను సంహరించాలా? సంహారం సాగించి సాధించేదేమిటి? ఇంతకన్నా అస్త్ర సన్యాసం చేసి, కురుక్షేత్ర రణక్షేత్రం నుంచి తొలగడమే మెరుగనిపించింది సవ్యసాచికి. నేను, నాది అన్న భావన కర్తవ్యమూఢుణ్ని చేసింది. అర్జున విషాదయోగం కృష్ణ గీతామృతానికి మూల కారణమైంది. విధిని ఎదిరించమని గాని, లొంగిపొమ్మనిగాని కృష్ణుడు చెప్పలేదు. కర్తవ్యం గుర్తు చేశాడు. ‘ఒక యోధుడిగా పోరు సలపడమే నీ విధ్యుక్త ధర్మం. అదే నిన్ను కాపాడుతుంది. కర్మకు తగ్గ ఫలితం ఇస్తుంది’ అన్నాడు.అలా చేయడం నిష్కామ కర్మ యోగం. కర్మతో యోగించమని, కర్మఫలాన్ని గురించి ఆలోచించకని పరమాత్మ ఆదేశించాడు.విధి అంటే జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు, లాభనష్టాలు, మంచి చెడ్డలు మాత్రమే కాదు. సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కుంగిపోవడం అంతకన్నా కాదు. భౌతిక జీవితంలో తారసపడే అనుభవాలు, అనుభూతులు, విధి విధానానికి కొలమానాలు కావు. అవి కేవలం నీటి బుడగలు. జీవితంలో ఘటనలకు అతీతంగా శోధించి, సాధించవలసిన పరమార్థం ఒకటున్నది. అదే గమ్యం… అదే పరమార్థ సాధన.యోగ దృష్టికి సకల చరాచరాల్లో ఏకత్వం కనిపిస్తుంది. భూత భవిష్యత్‌ వర్తమానాలు కరతలామలకం అవుతాయి. ఏకకాలంలో మూడు మండలాలతో మమేకం కాగలడు. బ్రహ్మాది దేవతలకు అంతుపట్టని పరతత్వం ఒక యోగ దృష్టికి సామంతం నెరపుతుందని, మోక్ష సాధనకు యోగ మార్గమే శరణ్యమని గీత చెబుతున్నది. భర్తృహరి సుభాషితంలో యతి నృపతి సంవాదం ఈ సత్యానికి తెరతీస్తున్నది. యోగాలకు రాజు రాజయోగం. రారాజు కరవాలం కన్నా యోగి రాజు యోగబలం చురుకైనది, కరుకైనది.ఆచరణీయమైన ఆలోచనలకు సానపట్టడమే సాధన. ఒక గాజుపాత్రలో నీళ్లు పోసి నిదానంగా పరిశీలించినప్పుడు, అట్టడుగున నీటిలోని వ్యర్థాలు కనిపిస్తాయి. యోగి ఆలోచనలను వడగట్టి, బుద్ధిని ఏకాగ్రం చేయడం వల్ల మనసు నిలకడ పొందుతుంది. మబ్బు తొలగిన సూర్యుడిలా సత్యం అవగతమవుతుంది. చిత్త వృత్తులను నిరోధించడం యోగం అని, నిశ్చలబుద్ధితో పనిచేయడమే కర్మ కౌశలం అని… ఈ రెండింటి సంయోగమే విధి విధానం అని గ్రహించాలి. విధికి సరైన నిర్వచనాలుగా స్వీకరించాలి.
11. రాశిఫలం – 13/03/2020
తిథి:
బహుళ చవితి మ.2.28 , కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం:
స్వాతి రా.7.31
వర్జ్యం:
రా.12.48 నుండి 2.18 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు
రాహు కాలం:
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధివుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలెక్కువగా వుంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటకం:
(పునర్వసు4 పా., పుష్యమి, ఆశ్రేష) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృధా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా వుంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
12. శ్రీశైలంలో క్యూలైన్‌లో భక్తులకు శానిటైజర్‌!
కరోనా వైరస్‌ ప్రభావంతో అప్రమత్తమైన తెలుగు రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. సూచనలతోపాటు వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. దేవాలయాల్లో కూడా వ్యక్తిగత శుభ్రతపై భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దేవాలయమైన శ్రీశైల క్షేత్రంలో దర్శన సమయంలో క్యూలైన్లో వచ్చే భక్తులకు శానిటైజర్‌ను అందజేస్తున్నారు. భక్తులు చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో అధికారుల ముందస్తు చర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.