Devotional

తిరుమలలో కొరోనా నివారణ చర్యలు

Tirumala TTD Coronavirus Checks Tests Extensive

తిరుమలలో నివారణ చర్యలు
కరోనా వ్యాప్తి నివారణకు తితిదే పటిష్ఠ చర్యలు చేపడుతోందని, అలిపిరి చెక్పాయింట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో భక్తులకు థర్మల్ స్కానింగ్ చేసి నిర్ధారించుకున్నాకే తిరుమలకు అనుమతిస్తామని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తిరుపతి నుంచి తిరుమలకు బయలుదేరే ముందు భక్తులకు థర్మల్ స్కానింగ్ చేస్తున్నామని.. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే రుయా ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతామని చెప్పారు. భక్తులు ఎక్కువగా ఉండేచోట రెండు గంటలకోసారి పరిశుభ్రత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
3.కరోనా తనిఖీ అయ్యాకే అయ్యప్ప దర్శనం
మాస పూజల నిమిత్తం అయ్యప్ప స్వామి దేవాలయం తలుపులు శుక్రవారం సాయంత్రం తెరుచుకున్నాయి. కరోనా వైరస్ హెచ్చరికల నేపథ్యంలో చాలా తక్కువ మంది భక్తులు హాజరయ్యారు. అధికారులు పంపాలో తనిఖీలు నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలిన తరువాతే భక్తులను కొండపైకి పంపించారు. కొంతమంది భక్తులు మాస్కులు ధరించి వచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయానికి రావొద్దని కేరళ రాష్ట్ర ప్రభుత్వం, దేవస్థానం బోర్డులు ఇటీవల భక్తులకు విజ్ఞప్తి చేశాయి. ఆలయాన్ని ఈ నెల 18 వరకు తెరిచి ఉంచుతారు.
4. తిరుపతిలో మరో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన తరహాలోనే తిరుపతిలో శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పుష్పయాగం ఈనెల (మార్చి) 20న జరగనుంది. గత నెల (ఫిబ్రవరి) 14 నుంచి 22వ తేది వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలలో భాగంగా తెలిసో తెలియకో దేవదేవునిపట్ల ఏవైనా లోపాలు సంభవిస్తే వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ యాగం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దీనివల్ల అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు, భక్తజనం అందరిలో ఎవరివల్ల కలిగిన దోషాలేవైనా తొలగిపోతాయని అర్చక పండితులు అంటారు. కన్నుల పండువగా సాగే ఈ పుష్పయాగంలోనూ భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. కేవలం రూ.500 చెల్లించడం ద్వారా ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇలాంటి భక్తులైన గృహస్తులకు ఇద్దరికి రవికె, ఉత్తరీయం బహుమతిగానూ అందజేస్తారని తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పుష్పయాగం కోసం ఒకరోజు ముందుగానే 19వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 20వ తేది (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనిని కళ్లారా చూడవలసిందే కానీ, వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి అనేక రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు వీథి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో 19వ తేదీన తిరుప్పావడ సేవ, 20న ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.
5. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో 7 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జూబ్లీహిల్స్లో కొలువుదీరిన టీటీడీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 17వ తేదీ వరకు కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు చెందిన పోస్టర్ను టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గోవిందహరి, వైస్ చైర్మన్ కొండా రాఘవరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోకల్ అడ్వయిజరీ కమిటీ సభ్యులు వెంకట్రెడ్డి, సుఖేందర్రెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
6. పంచాంగము 14.03.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణ
ఋతువు: శిశిర
మాసం: ఫాల్గుణ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: పంచమి ప.12:56 వరకు
తదుపరి షష్ఠి
వారం: శనివారం (మంద వాసరే)
నక్షత్రం: విశాఖ రా.06:37 వరకు
తదుపరి అనూరాధ
యోగం: హర్షణ సా.05:37 వరకు
తదుపరి వజ్ర
కరణం: తైతిల సా.05:22 వరకు
తదుపరి వణిక
వర్జ్యం: రా.10:28 -12:00
దుర్ముహూర్తం: 06:24 – 08:01
రాహు కాలం: 9:25 – 10:55
గుళిక కాలం: 06:24 – 07:54
యమ గండం: 01:55 – 03:25
అభిజిత్ : 12:01 – 12:49
సూర్యోదయం: 06:24
సూర్యాస్తమయం: 06:25
వైదిక సూర్యోదయం: 06:28
వైదిక సూర్యాస్తమయం: 06:22
చంద్రోదయం: రా.11:18
చంద్రాస్తమయం: ఉ.10:03
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: పశ్చిమం
రంగ పంచమి
మీనం సంక్రమణం
షడశీతి పుణ్యకాలం
ఏకనాథ షష్ఠి
మీన మల మాసారంభం
శ్రీ వనచంద్ర జయంతి
7. రాశిఫలం – 14/03/2020
తిథి:
బహుళ చవితి మ.2.28 , కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం:
స్వాతి రా.7.31
వర్జ్యం:
రా.12.48 నుండి 2.18 వరకు
దుర్ముహూర్తం:
ఉ.08.24 నుండి 09.12 వరకు, తిరిగి మ.12.24 నుండి 01.12 వరకు
రాహు కాలం:
ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరును. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధివుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసలవల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలెక్కువగా వుంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృధా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా వుంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో వుంటారు. స్ర్తిలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించక తప్పదు.
8. చరిత్రలో ఈ రోజు/మార్చి 14
1664 : సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ మరణం.
1879 : ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జననం.
1883 : ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.
1888 : అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమ ప్రారంభం.
1917 : స్వరబ్రహ్మగా పేరొందిన ప్రఖ్యాత స్వరకర్త కె.వి. మహదేవన్ జననం.
1931 : భారతదేశములో తొలి టాకీ చిత్రము ఆలం ఆరా ముంబైలో విడుదల.
9. శ్రీవారి ఆలయంలో జరిగిన తరహాలోనే తిరుపతిలో శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పుష్పయాగం ఈనెల (మార్చి) 20న జరగనుంది. గత నెల (ఫిబ్రవరి) 14 నుంచి 22వ తేది వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలలో భాగంగా తెలిసో తెలియకో దేవదేవునిపట్ల ఏవైనా లోపాలు సంభవిస్తే వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ యాగం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దీనివల్ల అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు, భక్తజనం అందరిలో ఎవరివల్ల కలిగిన దోషాలేవైనా తొలగిపోతాయని అర్చక పండితులు అంటారు. కన్నుల పండువగా సాగే ఈ పుష్పయాగంలోనూ భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. కేవలం రూ.500 చెల్లించడం ద్వారా ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇలాంటి భక్తులైన గృహస్తులకు ఇద్దరికి రవికె, ఉత్తరీయం బహుమతిగానూ అందజేస్తారని తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పుష్పయాగం కోసం ఒకరోజు ముందుగానే 19వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 20వ తేది (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం అత్యంత వైభవంగా జరుగుతుంది.
దీనిని కళ్లారా చూడవలసిందే కానీ, వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి అనేక రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు వీథి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో 19వ తేదీన తిరుప్పావడ సేవ, 20న ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది
10. జూబ్లీహిల్స్‌లో కొలువుదీరిన టీటీడీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 7 నుంచి 17వ తేదీ వరకు కనులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు చెందిన పోస్టర్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, తెలంగాణ లోకల్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ గోవిందహరి, వైస్‌ చైర్మన్‌ కొండా రాఘవరెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోకల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, సుఖేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
11. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారో ఆయనకే తెలియదని, అలాంటప్పుడు తనకు మాత్రం ఎలా తెలుసునని తమిళ సినీ హాస్యనటుడు వడివేలు యెద్దేవా చేశారు. శుక్రవారం ఉదయం వడివేలు తిరుచెందూరు సుబ్రమణ్యస్వామివారి ఆలయాన్ని దర్శించారు. ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయం వెలుపల విలేఖరుల సమావేశంలో వడివేలు మాట్లాడుతూ, ప్రపంచ శాంతి కోసం స్వామివారిని దర్శనం చేసుకున్నానని తెలిపారు.
రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి విలేఖరులు ప్రశ్నిచగా, రజనీ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో మీకు తెలియదు… నాకూ తెలియదు… అంతెందుకు రజనీకాంత్‌కే తెలియదంటూ చెణుకు విసిరారు. అయితే పార్టీకి ఓ నాయకత్వం, పాలనకు మరో నాయకత్వం అనే రజనీ కొత్త సిద్ధాంతాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అంతటితో ఆగకుండా తాను ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్నానని, ఎన్నికల్లో నిలిస్తే మీరు ఓటేస్తారా అని విలేఖరులను అడిగారు. తప్పకుండా ఓటేస్తామని విలేఖరులు చెప్పినప్పుడు మీరు ఓటేస్తే తప్పకుండా తాను సీఎం అవుతానంటూ నవ్వుతూ వడివేలు వెళ్లిపోయారు.
12. వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ
గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జాస్తిపల్లి గ్రామంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ముత్యాలమ్మతల్లి, గంగమ్మతల్లి, సుబ్రహ్మణ్యేశ్వర, పరమేశ్వర, పంచముఖ నాగేంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా జరిగింది. గణపతి పూజ అనంతరం ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బంధు, మిత్రుల రాకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.