Devotional

శబరిమలలో ఉత్సవాలు రద్దు

Sabrimalai Temple Festivities On Hold Due To COVID19

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో ఈ నెల 29వతేదీన శబరిమల ఆలయంలో నిర్వహించాల్సిన ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) బుధవారం ప్రకటించింది.శబరిమలలోని ప్రధాన ఆలయంతోపాటు కేరళ రాష్ట్రంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్న పలు దేవాలయాల్లో జరగాల్సిన ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు టీడీబీ అధికారులు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ ప్రకటన మేర కరోనా వైరస్ ప్రబలకుండా సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు వీలుగా ఆలయాల్లో ఉత్సవాలను రద్దు చేశామని ఆలయ అధికారులు చెప్పారు. దేశంలో కరోనా వైరస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వివరించారు.

Image result for sabarimala temple closed