ScienceAndTech

శానిటైజర్ల తయారీలో ఇస్రో

ISRO Gets Into Sanitizer Making For COVID19 Fight

కరోనావైరస్‌పై పోరాటంలో దేశానికి మద్దతుగా ఉండేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. తేలిగ్గా ఆపరేట్‌ చేసే విధంగా ఉండే వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి సహకరించనుంది. ప్రస్తుతం దేశంలో అత్యవసరమైన పరికరాల తయారీకి తోడ్పాటునందించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌ వెల్లడించారు. ప్రస్తుతం విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌సెంటర్‌లోని ఏ వ్యక్తి కూడా కొవిడ్ బారిన పడలేదని ఆయన పేర్కొన్నారు. వెంటిలేటర్‌ను కేవలం విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డిజైన్‌ చేస్తుందని చెప్పారు. దాని తయారీ బాధ్యతలను పరిశ్రమలే తీసుకోవాలన్నారు. ‘‘మేం దాదాపు 1,000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశాం. మా ఉద్యోగులు మాస్కులను తయారు చేస్తున్నారు. మా కమ్యూనికేషన్స్‌ కంప్యూటర్లు అత్యంత సురక్షితమైనవి. అవసరమైతే మా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తారు. అవసరమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెడతాం’’ అని సోమ్‌నాథ్‌ అన్నారు. ప్రస్తుతానికి రాకెట్ల తయారీని ఆపినట్లు సమాచారం. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగానికి సంబంధించిన రాకెట్లను కూడా లాంచ్‌ప్యాడ్స్‌ నుంచి అసెంబ్లింగ్‌ భవనానికి తీసుకొచ్చారు.

Coronavirus update in India: Facing shortage, IIT Delhi's ...