ScienceAndTech

కొరోనా టీకా వస్తోంది

Johnson & Johnson Announces Successful Vaccine For COVID19

కరోనా వైరస్‌కు ప్రయోగాత్మకంగా ఒక టీకాను అభివృద్ధి చేసినట్లు ఔషధ తయారీ సంస్థ ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ ప్రకటించింది. సెప్టెంబర్‌ నాటికి దీన్ని మానవులపై ప్రయోగించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభానికల్లా దీన్ని అత్యవసర వినియోగం కోసం సిద్ధం చేస్తామని పేర్కొంది. తాజాగా కనుగొన్న టీకాకు ‘ఏడీ26 సార్స్‌-కోవ్‌-2’ అని పేరు పెట్టారు. ఎబోలా వైరస్‌కు టీకాను అభివృద్ధి చేయడానికి ఉపయోగించిన పరిజ్ఞానంతోనే దీన్ని సిద్ధం చేశారు.