NRI-NRT

9/11ను దాటేసిన న్యూజెర్సీ కొరోనా మరణాలు

New Jersey COVID 19 Death Toll Crosses 911 Deaths

34124 మంది కొరోన బాధితులతో విలవిలలాడుతున్న అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం శనివారం సాయంత్రం మరో సరికొత్త రికార్డును అధిగమించింది. 2001 సెప్టెంబరు 11వ తేదీన జరిగిన ఉగ్రవాద దాడిలో 704 మంది న్యూజెర్సీ రాష్ట్రానికి చెందినవారు మరణించగా, శనివారం నాటి 200 మరణాలతో ఇప్పటివరకు న్యూజెర్సీ రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 846కు చేరుకుంది. అమెరికాలో అత్యధిక కొరోనా బాధితులు కలిగిన రాష్ట్రాలుగా న్యూజెర్సీ, న్యూయార్క్‌లు అగ్రపథంలో కొనసాగుతున్నాయి.