Food

ప్రోటీన్లు ఎక్కువ తీసుకుంటే మంచిదేనా?

Is high protein good for you-Telugu food and diet news

ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తినడంవల్ల ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు… వంటివి రావు అన్నది తెలిసిందే. అలాగని అదేపనిగా ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తింటే హృద్రోగాలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. ఎందుకంటే ప్రొటీన్‌ ఆహారాన్ని ఎక్కువగా తీసుకునేవాళ్లలో జీవక్రియాలోపాలు ఏర్పడటం వల్ల రక్తనాళాల్లో సమస్యలు ఏర్పడుతున్నాయట. ముఖ్యంగా వీటిల్లో ఎక్కువగా ఉండే మెథియోనిన్‌, సిస్టీన్‌ అనే సల్ఫర్‌తో కూడిన అమైనో ఆమ్లాల కారణంగా మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతున్నట్లు గుర్తించారు. దీని కారణంగా వీటిని ఎక్కువగా తీసుకునేవాళ్లలో హృద్రోగాలు, పక్షవాతం, మధుమేహం పెరిగినట్లూ రుజువైంది. అయితే ఈ సల్ఫర్‌ అమైనో ఆమ్లాలు పండ్లూ కూరగాయలూ ధాన్యాల్లో కన్నా మాంసాహారంలోనే ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు, ఈ రకమైన ఆమ్లాలు శాకాహారం తినేవాళ్లలో తక్కువగా ఉన్నట్లూ తేలింది. కాబట్టి ప్రొటీన్లు తీసుకునేటప్పుడు అవి ఏ రకమో తప్పక గుర్తుపెట్టుకోవాల్సిందే మరి.