Politics

10-7 దుకాణాలు తెరవచ్చు

YS Jagan Relieves Shop Opening Times In Andhra

రాష్ట్రంలో కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులతో సమావేశమయ్యారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 7 వరకు దుకాణాలు తెరవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.