Fashion

నగలే కోటలు

Telugu Fashion & Jewelery - Fort Shaped Necklaces

ఒక పెద్ద కోట. అందులో అందమైన యువరాణి. బోలెడు కథల్లో ఇలాంటి వర్ణనలు మనం చదివే ఉంటాం. అయితే యువరాణుల్లాంటి ఆడపిల్లల మెడల్లో ఆ కోటలు ముచ్చటగా ఒదిగిపోతే రాజసమంతా ఓ చోట పోగైపోదూ అనుకున్నారేమో డిజైనర్లు… ‘క్యాజిల్‌ జ్యువెలరీని’ రూపొందిస్తున్నారు. ఈ తరహా పెండెంట్లను ముత్యాలూ, పగడాలతో పాటు పచ్చలూ, కెంపులూ సహా వివిధ రంగుల రాళ్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. రకరకాల కోటల ఆకృతిలో చూడగానే కళ్లను కట్టిపడేసేలా తయారవుతున్న ఇవి, అమ్మాయిల మనసు దోచేస్తాయనడంలో సందేహమా!