Kids

హింసకు విరుగుడు ప్రేమ-తెలుగు చిన్నారుల కథ

The greatness of love over violence-Telugu kids moral stories

ఒక రైతు ఒక వేటగాడు పక్క పక్క ఇళ్లల్లో నివసిస్తూ ఉండేవారు .రైతు దగ్గర చాల మేకపిల్లలు ఉండేవి . వేటగాడి దగ్గర కుక్కలు ఉండేవి.

వేటగాడి కుక్కలు రైతు మేకలపై దాడి చేసి గాయపరుస్తూ ఉండేవి .రైతు వెళ్లి వేటగాడి దగ్గర ఇలా కుక్కల్ని వదిలేయడం భావ్యం కాదు కట్టివేయమని చెప్పాడు కానీ చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయింది ఎప్పటి లాగే మళ్ళి కుక్కలు మేకలపై దాడికి వెళ్ళాయి.

రైతు ఈసారి కాస్త ఆవేశంగా చెప్పడంతో వేటగాడు ఇంకా ఎక్కువ కోపంతో నా కుక్కలు ఇంతే ఏమి చేసుకుంటావో చేసుకో అని చెప్పాడు

ఇక చేసేది లేక రైతు పంచాయతీ పెట్టాలని ఊరిలోని పెద్దమనిషి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పాడు

అయన సమస్య విని రైతుతో ఒక ప్రశ్న అడిగాడు

నీది అతనిది సొంత ఇల్లు
అతనితో మిత్రుడిలా ఉండాలనుకుంటున్నావా లేక శత్రువు అవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు
మిత్రుడిలా ఉండాలనే అనుకుంటున్నాను అని చెప్పాడు రైతు అయితే నేను చెప్పినట్టు చెయ్యి అని సలహా ఇచ్చాడు ఆ ఊరి పెద్ద

ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఆలోచించిన రైతుకు ఊరిపెద్ద సలహా నచ్చడంతో ఆచరణలోకి దిగాడు

తన దగ్గర ఉన్న మేకలలో చిన్నదైన రెండింటిని వేటగాడి పిల్లలకు బహుమతిగా ఇచ్చాడు రైతు

ఆ పిల్లలు కొత్తగా వచ్చిన వాటితో చాల ఆనందంగా గడిపారు వారి సంతోషాన్ని వేటగాడు కూడా ఆపలేక ఆ మేకపిల్లలరక్షణ కోసం కుక్కల్ని ఆ రోజు నుండి కట్టి వేయసాగాడు ఎవరూ చెప్పకుండానే
అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఏదైనా దొరికితే బహుమానంగా రైతుకు ఇవ్వడంతో ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది

బలం బలగం ఉంది కదా అని ప్రతి సారి గొడవకు వెళ్లడం సరి కాదు
మేకలు ముఖ్యమే అంతకంటే ముందు మనశాంతి చాల ముఖ్యం కదా
జీవితాంతం శత్రువుగా ఉండేకన్నా మిత్రులుగా మారిపోవడంలో తప్పు లేదు కదా …

Be Good….
Do Good….