Business

క్యాప్‌జెమిని నుండి విప్రో సీఈఓగా డెలాపోర్ట్

Wipro Gets New CEO Thierry Delaporte

టెక్‌ దిగ్గజం విప్రో కొత్త సీఈవో, ఎండీగా క్యాప్‌జెమినీకి చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ థియర్రీ డెలాపోర్ట్‌ను నియమించారు. ప్రస్తుత సీఈవో, ఎండీ అబిదాలీ నీముచ్‌వాలా జూన్‌ 1న పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ తర్వాత రషీద్‌ ప్రేమ్‌జీ జులై 5 వరకు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను చూడనున్నారు. జులై 6న డెలాపోర్ట్‌ విధుల్లో చేరనున్నారు. థియర్రీ క్యాప్‌జెమినీలో చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన ఆ కంపెనీలో దాదాపు 25ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వహించారు.