DailyDose

గృహనిర్బంధంలో రేవంత్ రెడ్డి-తాజావార్తలు

Revanth Reddy In House Arrest - Telugu breaking news

* పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు, సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘స్టేట్‌ టెక్నికల్‌ కోఆర్డినేటర్లు’గా ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది.

* మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఏ రేవంత్ రెడ్డిని కొడంగల్ లోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు

* తెలంగాణలో త్వరలో బడిగంట మోగనుంది. జూలై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన పక్షంలో ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్‌ చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. ఒక తరగతి గదిలో 15 మంది మాత్రమే కూర్చోవడానికి అనుమతి ఇచ్చింది. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలున్న విద్యార్థులు బడులకు హాజరు కావొద్దని సూచించింది. పాఠశాల గ్రౌండ్‌లో, తరగతి గదుల్లో భౌతికదూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కు వాడటంతో పాటు శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలని తెలిపింది. కరోనా నేపథ్యంలో 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించాలని మార్గదర్శకాల్లో పొందుపరిచింది.

* ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. స్టెరిన్ గ్యాస్ ప్రభావంతో యలమంచలి కనకరాజు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజులు చికిత్స పొందిన కనకరాజు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఇంటికి వెళ్లిపోయాడు.

* స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు రైళ్లు, బస్సులు ఎక్కేవరకు వారికి భోజనం, వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటుక బట్టీల కార్మికులు, వలస కూలీలను స్వస్థలాలను తరలించాలని దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కార్మిక శాఖ ఉప కమిషనర్లు ఇటుక బట్టీలు సందర్శించి వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది.

* ఇటీవల చైనా తమ సైనిక బలగాలను భారత సరిహద్దుల్లోకి తరలించిందని అమెరికా ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో తెలిపారు. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఈ అంశంలో భారత్‌కు మద్దతు పలికిన పాంపియో.. డ్రాగన్‌ దుశ్చర్యలను తప్పుబట్టారు. ఇటీవల తూర్పు లద్దాఖ్‌, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట భారత్‌-చైనా సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కొన్ని రోజులు ఉద్రిక్తలు కొనసాగాయి

* పథకాలు, మొబైల్‌.. టీవీ కనెక్షన్ల వంటివి పొందడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరన్న విషయం అందరికి తెలుసు. కానీ తమిళనాడు ప్రజలకు సెలూన్‌లో జుట్టు కత్తించుకోవడానికి కూడా ఇప్పుడు ఆధార్‌ కార్డు తప్పనిసరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో తాజాగా భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో సెలూన్‌లు కూడా తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. అయితే సెలూన్‌కు వచ్చే కస్టమర్ల వివరాలను యజమానులు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.