Devotional

రేపటి నుండి తిరుమలకు ఆర్టీసీ సేవలు

Tirumala Bus Services To Begin From Tomorrow

* ముగిసిన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి తెప్పోత్స‌వాలు. తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు శుక్ర‌‌వారం ముగిశాయి.కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్న విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవర్ల‌కు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ‌ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

* చక్రస్నానంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

* తిరుమల శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శుక్ర‌వారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి అభ‌య‌మిచ్చారు.

* రేపటి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులు. టిటిడి ఉద్యోగులను సిబ్బందిని తిరుమలకు తరలించేందుకు 50 బస్సులు నడపాలని నిర్ణయించిన ఆర్టీసీ.