Movies

స్పానిష్ భర్త

స్పానిష్ భర్త

తాప్సీ, రాధికా ఆప్టే, శ్రియాశ‌ర‌న్ బాట‌లోనే మ‌రో బాలీవుడ్ బ్యూటీ అడుగు పెట్ట‌నుంది. ఆమె ఎవ‌రో కాదు ఈషా గుప్తా. సినిమాల్లో, సోష‌ల్ మీడియాలో హాట్ అందాల‌ను ఆర‌బోయ‌డంలో ఏమాత్రం ఆలోచించ‌ని ఈ ముద్దుగుమ్మ ఓ విదేశీయుడ్ని ల‌వ్ చేసింది. స్పానిష్‌కి చెందిన మ్యానువ‌ల్ కాంపోస్ గుల్లార్‌తో తాను ప్రేమ‌లో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ఈషా గుప్తా తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈషా గుప్తా తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ ‘విన‌య‌విధేయ‌రామ‌’ చిత్రంలో ఓ చిన్న పాత్ర‌లో మెరిసింది