Health

తితిదేలో తొలి కరోనా కేసు-TNI బులెటిన్

తితిదేలో తొలి కరోనా కేసు-TNI బులెటిన్

* ఏపీలో అదుపులోకి రాని కరోనా.రాష్ట్రంలో గత 24 గంటల్లో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.11775 సాంపిల్స్ ని పరీక్షించగా 141 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ.59 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్.రాష్ట్రం లోని నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 4402.ఇప్పటివరకు 2599 మంది డిశ్చార్జ్.80 మంది కరోనా పాజిటివ్ తో మృతి.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1723.విదేశాల నుంచి వచ్చిన వారు 199 కరోనా పాజిటివ్.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1035 వారికి కరోనా పాజిటివ్.

* టీటీడీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు.టీటీడీ శానిటరీ ఇన్స్పెక్టర్ కి కరోనా పాజిటివ్. గోవిందరాజ స్వామీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారి. రెండు రోజులపాటు గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శనాల నిలిపివేత. ఉద్యోగికి కరోనా రావడంతో ఆలయంలో పూర్తి గా శానిటేషన్.

* పాకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి పంపించడానికి అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. కరోనా వైరస్‌ – లాక్‌డౌన్‌ కారణంగా సుమారు 690 మంది పాకిస్థాన్‌లో చిక్కుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 23న వారిని వాఘా- అట్టారి సరిహద్దు ద్వారా స్వదేశానికి పంపనున్నట్లు తెలుస్తోంది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తుది అనుమతుల కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.

* కరోనా రోగుల చికిత్స, కరోనా మృతదేహాల అంత్యక్రియల నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసును సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు విచారించింది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలు ఆస్పత్రుల వార్డుల్లో, గార్బేజీలో పడేసిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని జస్టిస్ కౌల్ అన్నారు. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ, పశ్చిమ బంగ, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

* కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్‌ తీవత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా ఇక్కడ ప్రతిరోజు దాదాపు 2500లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 3607 కేసులు నమోదవడంతో పాటు, 152 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 97,648కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3590 మంది మృత్యువాతపడ్డారు.