ScienceAndTech

61 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం

61 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం

అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పేస్‌ఎక్స్‌ నింగిలోకి 61 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది.

58 ఉపగ్రహాలు స్టార్‌లింక్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించినవి కాగా, మరో మూడు స్కైశాట్‌కు సంబంధించినవి.

స్కైశాట్‌ శాటిలైట్స్‌ను దిగువ భూకక్ష్యలోకి ప్రయోగించింది.

వీటిని ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా అమెరికాలోని కేప్‌ కెనర్వాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపించారు.

ప్రయోగానంతరం రాకెట్‌ తిరిగి క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చిందని సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. 
 
కాగా, భూమిపై విస్తృతస్థాయిలో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సంధానత ఇవ్వడం స్టార్‌లింక్‌ ప్రాజెక్ట్‌ ఉద్దేశం.

2018 ఫిబ్రవరిలో ఈ ప్రయోగం ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 12 వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా స్కైశాట్‌ శాటిలైట్లు భూమిమీద నిర్దిష్ట  ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలను స్పాట్‌లో తీసి పంపే సామర్థ్యం కలిగి ఉన్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.