Health

కరోనాకు ఆవనూనె చిట్కా

TNILIVE Health || Mustard Seed Oil For COVID19

కరోనాకు పోలీసుల చిట్కా.. ఆవాల నూనె, నిమ్మరసంతో సత్ఫలితాలు

కరోనా వైరస్ బారిన పడిన పోలీస్ కుటుంబాలు.. ఈ చిట్కాతో వేగంగా కోలుకున్నారని, మీరు కూడా పాటించండి అంటూ.. ఏకంగా కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

కరోనా వైరస్‌పై సర్వత్రా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలే తమంతట తాము జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్ ఇప్పుడు మరింత వేగంగా ఇతరులకు సోకే అవకాశం ఉంది. అది మన వరకు రాకూడదంటే.. వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లో గడపడమే ఉత్తమం. అలాగే, కరోనా సోకినా.. దానితో పోరాడేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనాను మట్టి కరిపించాలి.

ఈ సందర్భంగా ఉత్తర బెంగాల్‌ పోలీసులు.. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కొన్ని చిట్కాలు చెప్పారు. ఆవాల నూనె (ఆవ నూనె), నిమ్మకాయ కలిపిన వేడి నీళ్లు తాగితే కరోనాను తరిమి కొట్టవచ్చని తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కరోనా నుంచి త్వరగా కోలుుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిలిగురి పోలీస్ కమిషనరేట్ తమ ఉద్యోగులకు సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.

ఇటీవల క‌మిష‌న‌రేట్‌లోని డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ బంధువుకు, ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్‌కు క‌రోనా వైరస్ సోకింది. దీంతో వాళ్లు నిమ్మ రసం, ఆవనూనె కలిపిన వేనీళ్లను సేవించారు. దానివల్ల వారి ఆరోగ్యం కుదుటపడిందని, త్వరగానే కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఆవ‌నూనె, నిమ్మ రసం ఇంట్లోనే అందుబాటులో ఉంటాయని, ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టం కాదని పేర్కొన్నారు.

ఈ మిశ్రమం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి మెరుగుపడి కరోనా వైరస్‌తో పోరాడుతుందన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ త్రిపురారీ అర్థవ్ మాట్లాడుతూ.. ‘‘ఆవనూనె, నిమ్మరసం మిస్రమం తాగాలనే చిట్కా మన పెద్దల నుంచి వస్తోంది. కొద్ది రోజుల కిందట డార్జిలింగ్‌లోని ఓ పోలీస్ అధికారి, ఆయన భార్యకు కరోనా సోకింది. దీంతో వారు ఈ చిట్కానే పాటించారు. రెండు రోజుల్లో మంచి ఫలితం కనిపించింది. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నారు. మేం వైద్యులం కాకపోయినా.. చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పే సూత్రాన్నే పాటించాలని కోరుతున్నాం. అందుకే మా ఉద్యోగులు, ఇతరాత్ర సిబ్బందికి ఈ సూచనలు పాటించాలని సర్క్యలర్ జారీ చేశాం. ఈ చిట్కాలు పాటించి కరోనాను ఎదుర్కొన్న వైరస్ బాధితుల అనుభవాలను కూడా అందులో వెల్లడించాం’’ అని తెలిపారు. వైరస్ బాధితులు ఇంకా హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. వారిలో వైరస్ లక్షణాలు కనిపించకపోవడంతో అబ్జర్వేషన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న మరికొన్ని చిట్కాలు:
✺ ఉడికించిన బంగాళ దుంపలు, అన్నంలో కాస్త పచ్చి ఆవ నూనె వేసుకుని తినండి.
✺ ఇయర్ బడ్స్ సాయంతో రోజుకు మూడు సార్లు ముక్కు రంథ్రాలకు ఆవ నూనె రాయండి.
✺ రోజుకు 4 నుంచి 5 సార్లు ముక్కు, నోటికి ఆవిరి పట్టండి.
✺ రోజుకు నాలుగు సార్లు గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండి తాగండి.
✺ రోజుకు నాలుగు సార్లు ఉప్పు నీటిని పిక్కిలించి ఊయండి.
✺ రోజూ పసుపు కలిపిన గోరు వెచ్చని పాలను తాగండి.

గమనిక: కరోనా వైరస్‌కు ఇంకా మందు రాలేదు. ఇంటి చిట్కాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, వైరస్ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. వైద్యులు సలహాలు, సూచనలు పాటించండి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు.