NRI-NRT

ఫ్లోరిడా హిందూ టెంపుల్ అధ్యక్షుడిగా గుత్తికొండ శ్రీనివాస్ ఎన్నిక

Krishna District NRI Guthikonda Srinivas Elected As HTFL President

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల హిందూ ఆలయ అధ్యక్షుడిగా గుత్తికొండ శ్రీనివాస్ ఎన్నికయ్యారు. శ్రీనివాస్ స్వస్థలం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు. ఆయన గతంలో నాట్స్ బోర్డు ఛైర్మన్‌గా సేవలందించారు. ఈ ఆలయంలో సత్యనారాయణ స్వామి ప్రధాన దేవతగా ఉన్నారు. ఆయన కృపతో ఈ ఆలయాన్ని అమెరికాలో సనాతన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి, హిందు ధర్మ పరివ్యాప్తికి తనవంతు చేయూతనిస్తానని ఆయన తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల ప్రవాసులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.