Health

బియ్యంతో బీపీ తగ్గుతుందా?

Does eating rice relieve you from blood pressure

జన్యుమార్పులకు గురిచేసిన వరి వంగడాల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలానూ, కరవును తట్టుకుని పెరిగేలానూ మాత్రమే చేశారు. ఇప్పుడు హృద్రోగాలకు దారితీసే బీపీని తగ్గించేలా రూపొందించాం అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా బీపీని తగ్గించేందుకు అందుకు కారణమయ్యే యాంజియో కన్‌వర్టింగ్‌ ఎంజైమ్‌ శాతాన్ని తగ్గించే మందులు ఇస్తుంటారు. అయితే వాటివల్ల బీపీ తగ్గినప్పటికీ దుష్ఫలితాలూ ఎక్కువే. అందుకే పరిశోధకులు ఈ ఎంజైమ్‌ను నిరోధించే సహజ పదార్థాలమీద దృష్టి సారించారు. దాంతో ఎంజైమ్‌ను నిరోధించే అమైనోఆమ్లాలతో కూడిన జన్యువును రూపొందించి దాన్ని వరి మొక్కల్లో ప్రవేశపెట్టారు. దాన్నుంచి పండిన బియ్యాన్ని బీపీతో బాధపడుతున్న ఎలుకలకి పెట్టగా వాటికి బీపీ బాగా తగ్గినట్లు గుర్తించారు. పైగా ఎలాంటి దుష్ఫలితాలూ తలెత్తలేదట. సో, త్వరలోనే ఇవి వాడుకలోకి వస్తే బీపీని అడ్డుకోవచ్చన్నమాట.