Politics

వైకాపా ఫ్యాను కిందకు గంటా

వైకాపా ఫ్యాను కిందకు గంటా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు సమాచారం.

గంటా చేరికకు సీఎం జగన్ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆయనతో మంతనాలు చేసినట్లు గంటా సన్నిహితులు పేర్కొంటున్నారు.

ఆగస్టు 15 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ ప్రభుత్వం తలపోసింది.

ఈ కార్యక్రమం వేదికగానే గంటా వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై… సీనియర్లైన మంత్రి అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డి మోకాలడ్డుతున్నట్లు సమాచారం.

అయినప్పటికీ వైసీపీలో గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు… వైసీపీలో నెంబర్ 2 అని ఆయన్ను అందరూ భావిస్తారు.

వైసీపీలో చీమ చిట్టుక్కుమన్నా సరే… ఆయనకు తెలియాల్సిందే.

దాదాపు పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తాయని కేడర్‌ విశ్వాసం.

ఎవరు వైసీపీలోకి రావాలన్నా… పదవులు లభించాలన్నా ఆయన తప్పని సరిగా జోక్యం చేసుకుంటారు.

ఇంతటి కీలకమైన విజయ సాయి రెడ్డికే తెలియకుండా వైసీపీలో చేరిపోవడానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు పావులు కదిపినట్లు సమాచారం.

ఇక మరో కీలక నేత, గంటా ప్రత్యర్థి అయిన మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కూడా ఈ విషయం అసలు తెలియదట.

అలా గంటా శ్రీనివాస రావు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో ఈ తతంగాన్ని గంటా పూర్తి చేసేశారు.

అంతేకాకుండా సీఎం జగన్ కూడా ఈయన రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే గంటా రాకను రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఎలాగైనా సరే.. గంటా ఆగమనానికి బ్రేక్ వేయాలని శతధా ప్రయత్నించినట్లు సమాచారం. అయినా… గంటా వేసిన పాచికలతో వీరిద్దరూ ఇరుకున పడినట్లు సమాచారం.

విజయసాయి రెడ్డికి సైడ్ కొట్టేసి… తతంగం పూర్తి చేసిన గంటా

ఇటీవలి కాలంలో గంటాను టార్గెట్ చేస్తూ ఇరువురూ తీవ్ర విమర్శలకు దిగారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ అయితే ఓ అడుగు ముందుకేసి.. గంటా అరెస్ట్ తప్పదని ప్రకటించారు కూడా.

గంటా పార్టీలోకి వస్తే… తమ ప్రాధాన్యం తగ్గిపోతుందని వీరిద్దరూ భయపడుతున్నట్లు సమాచారం.

గంటాను మొదటి నుంచీ అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తూనే ఉన్నారు.

ఇక ఎంపీ విజయ సాయిరెడ్డి కూడా ఇదే బాటలో ఉన్నారు.

తనకు తెలియకుండా గంటా గనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. తన ప్రాధాన్యం పార్టీలో తగ్గిపోయిందని విమర్శలు వస్తాయని విజయసాయి రెడ్డి భావనగా ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

గంటా అరెస్ట్ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతి శ్రీనివాస్ లాగే.. విజయ సాయి రెడ్డి కూడా గంటాపై తీవ్ర విమర్శలే చేశారు.

గంటా మంత్రిగా ఉన్న సమయంలో సైకిళ్ల కుంభకోణం చేశారంటూ తిట్టిపోశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వైసీపీలో చేరడానికి గంటా విజయ సాయి రెడ్డి ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పుడు మాత్రం పార్టీలో నెంబర్ 2 గా చెలామణి అవుతున్న విజయసాయి రెడ్డికి సైడ్ కొట్టేసి… నేరుగా జగన్ కోటరీతో గంటా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది.

పార్టీకి సంబంధించి ఉత్తరాంధ్ర వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డే చూస్తున్నారు.

అంతటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న విజయసాయికే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గంటా చేరికపై సమాచారం లేకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.