DailyDose

15లక్షల దిశగా భారత కరోనా కేసులు-TNI బులెటిన్

15లక్షల దిశగా భారత కరోనా కేసులు-TNI బులెటిన్

* ఢిల్లీలోని కోవిడ్ కేర్ సెంటర్లో దారుణం.14 ఏళ్ల కోవిడ్ బాధిత బాలికపై అత్యాచారం.టాయిలెట్ వద్ద అత్యాచారం చేసిన 19 ఏళ్ల కోవిడ్ బాధితుడు.అతనికి కాపలాగా నిలబడి, ఫోన్లో ఘోరాన్ని చిత్రీకరించిన మరో కోవిడ్ బాధితుడు.బాధితురాలిని మరో ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స.నిందితులిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.కోవిడ్ బాధితులుగా ఉన్నందున మరో ఆస్పత్రికి తరలింపు.ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆస్పత్రిలో ఉంచిన అధికారులు.కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత జైలుకు తరలింపు.

* కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!బెంగళూరులోని దొమ్మలూర్ ప్రాంతంలో ఓ భవనంలో కరోనా కేసు నమోదైంది.దీంతో అధికారులు ఆ భవనంలోని రెండు కుటుంబాలను హోమ్​ క్వారంటైన్​లో ఉండమని హెచ్చరించారు.అంతటితో ఆగక, వారు బయటికి రాకుండా ఉండేలా తలుపులను ఉక్కు రేకులతో మూసేశారు.​ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు, వృద్ధ దంపతులు ఉన్న ఇంటిని ఇలా బంధించడమేంటంటూ ట్వీట్​ చేసింది ఆ మహిళ.విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఉక్కు సీల్​ను తీసేశారు.

* ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది.దీంతో ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ఎన్నో దేశాలు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాయి.అయినా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు.దీంతో ప‌లు ప్రాంతాల్లో ఎవ‌రికి తోచిన‌ట్లు వారు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్రం చెన్నైలోని మురికివాడ‌ల ప్ర‌జ‌ల‌కు హిజ్రాలు క‌రోనాపై అవ‌గాహ‌న క‌ల్పించారు.కోలాటం త‌దిత‌ర జాన‌ప‌ద నృత్యాలు చేస్తూ క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ప్ర‌చారం చేశారు. 

* దేశంలో కరోన బాధితుల సంఖ్య 12, 87, 945 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.గడచిన 24 గంటల్లో అత్యధికంగా 49, 310 పాజిటివ్ కేసులు నమోదు కాగా 740 మంది మృతి.4, 40, 135 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 8, 17, 209 మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 30, 601 మంది మృతి.నిన్న ఒక్కరోజే కోలుకున్న 34, 602 మంది బాధితులు.