Health

ఏపీలో నేడు 6051 కరోనా కేసులు-TNI బులెటిన్

ఏపీలో నేడు 6051 కరోనా కేసులు-TNI బులెటిన్

* ఏపీలో కరోనా విజృంభణఒక్కరోజులో రికార్డుస్థాయిలో 6,051 కేసులు నమోదు. 49మంది మృతి1,02,349కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య24 గంటల్లో జరిగిన 43,127 కరోనా పరీక్షలు3,234 మంది డిశ్చార్జ్‌51,701 యాక్టివ్‌ కేసులుఇప్పటివరకు 1090మంది మృతి

* కరోనా రక్కసి మానవ సంబంధాలనే దారుణంగా దెబ్బ తీస్తోంది ఇక డబ్బు సంబంధాల పరిస్థితి ఏంటి. గత పదేళ్లుగా హాస్టల్ నిర్వహిస్తున్న ఓ నిర్వాహకుడిని ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని గేటుకు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై ఇరువర్గాలు ఘర్షణలు దిగాయి. విషయం పోలీస్ స్టేషన్ కి చేరింది. కే పి హెచ్ బి కాలనీ 5 రోడ్ లో రమేష్ బాబు అనే వ్యక్తి కి ఎల్ ఐ జి బిల్డింగ్ ఉంది దీన్ని నాని అనే వ్యక్తికి హాస్టల్ కోసం ఇచ్చాడు గత పది సంవత్సరాలుగా ఇక్కడ హాస్టల్ కొనసాగుతోంది అయితే కరోనా నేపథ్యంలో వీరిరువురి మధ్య కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది ఈరోజు ఉదయం రమేష్ బాబు ఆదేశాల మేరకు వాచ్ మెన్ హాస్టల్ ప్రధాన గేటు తాళం వేశాడు దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

* కడప జిల్లా…నగరంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి కఠినంగా లాక్ డౌన్…కడప నగరంలో 11 గంటల లోపు దుకాణాలు తీరించేందుకు అనుమతి…11 గంటల తర్వాత దుకాణాలు మూసి వేయాలని సూచన…11 గంటల తర్వాత ప్రజలు , వాహన దారులు ఎట్టి పరిస్థితుల్లో బయట తిరిగేందుకు అనుమతి లేదన్న పోలీసులు…నగరంలోని వైవి స్ట్రీట్ తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పర్యవేక్షించిన కడప డిఎస్పీ సూర్యనారాయణ ..దయచేసి కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన డిఎస్పీ సూర్యనారాయణ.

* చంద్రగిరి మండలం రంగంపేటలో 2 రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు.ఆ మృతదేహానికి కొవిడ్ పరీక్ష చేయించాలని గ్రామస్థులు కోరారు.కుటుంబసభ్యులు ఆ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడంటూ వాదించి.. సమీపంలోని శ్మశానవాటికలో ఖననం చేశారు.అతని కుటుంబ సభ్యులు కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నారు. తీరా ఆ ఇంట్లో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది.రంగంపేటకు చెందిన మరో నలుగురుకి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు.అంత్యక్రియల్లో పాల్లొన్న మరి కొందరి ఫలితాలు రావాల్సి ఉంది.గ్రామంలో ఇప్పటివరకు మొత్తం 22 మందికి పాజిటివ్​గా నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.

* తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు-1053కాకినాడ అర్బన్ కరోనా పాజిటివ్ కేసులు- 305కాకినాడ రూరల్ కరుణ పాజిటివ్ కేసులు- 86కరప మండలం కాకినాడ రూరల్ కరోనా పాజిటివ్ కేసులు -22

* కడప రిమ్స్‌లో చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న కరోనా బాధితుడుకడప రిమ్స్‌ ఐసీయూలోకి బాధితుడి తరలింపుఐసీయూలో చికిత్స అందిచట్లేదని బాధితుడి కుమారుడి ఆరోపణ.