Food

వేసవి వేడికి విరుగుడు…సీతాఫలం

వేసవి వేడికి విరుగుడు…సీతాఫలం

ఇప్పుడు ప్ర‌తిఒక్క‌రూ ఇమ్యునిటీ పెంచుకునే ప‌నిలోనే ఉన్నారు. స‌మ‌యం, సంద‌ర్భాన్ని బ‌ట్టి ముందుకు వెళ్తూ ఉండాలి. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఇమ్యునిటీని పెంచే ఆహారం తీసుకోవాలి. అలాగే సీజ‌న్‌లో వ‌చ్చే పండ్లు, కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అన్ని ఆహార ప‌దార్థాల గురించి కాస్త అవ‌గాహ‌న ఉంది. మ‌రి రాబోయే సీజ‌న్‌లో వ‌చ్చే సీతాఫ‌లం పండు తింటే ఇమ్యునిటీ ప‌వ‌ర్ పెరుగుతుందా? అస‌లు ఈ టైంలో ఈ పండుని తిన‌డం ఉత్త‌మ‌మేనా అన్న సందేహాల‌ను ఇప్పుడు తీర్చుకుందాం.
***సీతాఫ‌లం ఉప‌యోగాలు
* సీతాఫ‌లంలో చెప్ప‌లేన‌న్ని పోష‌కాలు దాగున్నాయి. ఇందులో క్యాల‌రీలు, ప్రొటీన్లు, ఫ్యాట్‌, ఐర‌న్‌, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ప‌ర‌స్ వంటి పోష‌క ‌విలువులున్నాయి. ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో పాటు సీతాఫ‌లం చాలా రుచిగా ఉంటుంది.
* ఇందులో ఉండే యాంటీ-ఏజీయింగ్ ప్రాప‌ర్టీస్ వ‌ల‌న స్కిన్ గ్లో వ‌స్తుంది. ఈ పండు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.ఇందులోని విట‌మిన్లు వ‌య‌సు క‌నిపించ‌కుండా చేస్తుంది. వ‌య‌సు పెరు‌గుతున్న‌ప్ప‌టికీ యంగ్‌గా క‌నిపించేలా చేస్తుంది.
* సీతాఫ‌లం చూడ్డానికి పైన గ‌జ్జిగ‌జ్జిగా ఉన్నా లోప‌ల మాత్రం తెల్ల‌గా, న‌ల్ల‌ని విత్త‌నాలు క‌లిగి ఉంటుంది. కొన్ని పండ్లు గుండ్రంగా ఉంటే మ‌రికొన్ని హార్ట్ ఆకారంలో ఉంటాయి. ఇందులో ఉండే ఐర‌న్ ఆర్ట‌రీస్‌ను హెల్దీగా ఉంచుతుంది. సీతాఫ‌లం ర‌‌క్త‌ప్ర‌స‌ర‌ణను మెరుగుప‌రుస్తుంది.
* ఈ పండు తిన‌డం వ‌ల్ల హీమోగ్లోబిన్ లెవెల్స్ స‌రిగ్గా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబ‌ర్‌, మిన‌ర‌ల్స్ అరుగుద‌ల‌కి తోడ్ప‌డుతుంది. దీంతో గ్యాస్‌, కాన్స్టిపేష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను తొలిగించ‌వ‌చ్చు. అంతేనా.. డ‌యేరియా వంటి ప్రాబ్ల‌మ్స్‌కు కూడా చెక్ పెడుతుంది.
* ఈ పండు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌తిఒక్క‌రి బాడీ టెంప‌రేచ‌ర్ ఎక్కువ‌గానే ఉంటుంది. మ‌రి ఆ వేడిని త‌గ్గించాలంటే సీతాఫ‌లం పండ్లు తినాల్సిందే. ఈ పండుతో ఇమ్యునిటి ప‌వ‌ర్ కూడా పెరుగుతుంది. మ‌రి ఇంకే. అమ్మో.. క‌రోనా అని భ‌య‌ప‌డ‌డం మానేసి ఎంచెక్కా సీతాఫ‌లం పండ్లు తినేయండి.