NRI-NRT

మర్సెడ్ యూనివర్శిటీకి డా.లకిరెడ్డి భారీ విరాళం

మర్సెడ్ యూనివర్శిటీకి డా.లకిరెడ్డి ₹11కోట్ల విరాళం

తండ్రి బాటలోనే తనయుడు నడుస్తున్నాడు. ప్రముఖ దాత, ఇప్పటివరకు దాదాపు ₹80కోట్లను విరాళంగా అందించిన డా.లకిరెడ్డి హనిమిరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు డా.లకిరెడ్డి విక్రమ్ కూడా పయనిస్తున్నాడు. వారు నివసిస్తున్న మర్సద్ నగరంలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆడిటోరియం(బాల్‌రూమ్) నిర్మాణానికి భారీ విరాళాన్ని అందజేశారు. ఇటీవల యూనివర్శిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో డా.విక్రమ్‌తో పాటు ఆయన భార్య ప్రియ, కుటుంబ సభ్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. విక్రమ్‌ను యూనివర్శిటీ ఛాన్సల్ర్ హ్వాన్ సాంచెజ్ మునోజ్ అభినందించారు. గతంలో హనిమిరెడ్డి ఇదే యూనివర్శిటీలో ఆడిటోరియం నిర్మాణానికి విరాళాన్ని అందజేశారు.