Business

బంగారం ధరలు తగ్గవచ్చు-వాణిజ్యం

బంగారం ధరలు తగ్గవచ్చు-వాణిజ్యం

* హైదరాబాద్ బస్ భవన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల ఈ రోజు సమావేశం అయ్యారు.ఏపియస్ ఆర్టీసీ నుండి ముగ్గురు ఈడిలు, ఆపరేషన్ హెడ్ బ్రహ్మానంద రెడ్డితో పాటు పలువురు ఉన్న తాధికారులు హాజరయ్యారు.కరోనా కారణంగా ఆగిపోయిన అంతరాష్ట్ర సర్వీసుల రాకపోకల పై ఈ సమావేశం లో చర్చిస్తున్నారు.జూన్ 24న జరగాల్సిన ఈ సమావేశం పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. దేశాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా మార్చి మూడో వారం లో లాక్ డౌన్ విధించాయి రాష్ట్ర ప్రభుత్వాలు.దాంతో అప్పటినుండి తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.ఇక ఈరోజు జరిగే చర్చలతో అంతరాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

* పసిడి అక్టోబరు కాంట్రాక్టు ఈ వారం బలహీనంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అయితే కేంద్ర బ్యాంకులు ఏమంటాయన్నదాన్ని బట్టి మళ్లీ సరికొత్తగా ఊగిసలాట మొదలవుతుందా లేదా అన్నది తెలుస్తుంది. రూ.51,091 దిగువకు వస్తే మరింత బలహీనపడి రూ.49,638కి.. ఆ తర్వాత రూ.48,792కు..ఇంకా దిగువకు వెళ్లే అవకాశం ఉంది. వెండి సెప్టెంబరు కాంట్రాక్టు రూ.70,534పైన ట్రేడయితే తప్ప ఈ వారం కూడా బలహీనంగానే ఉండొచ్చు. ప్రతీ 4 శాతం క్షీణత వద్ద పొజిషనల్‌ ట్రేడర్లు కొనుగోళ్లు చేసే వ్యూహంలో ఉన్నందున.. స్పెక్యులేటివ్‌ ట్రేడర్లు పెరిగినపుడల్లా విక్రయించడం మంచి వ్యూహం అవుతుంది.

* అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా మధ్యశ్రేణి ధరలో కొత్త మోడల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన జీ8 మోడల్‌కు కొనసాగింపుగా మోటో జీ9 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్‌మీ నోట్ 9 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మీ 6ఐకు జీ9 గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ మాక్స్ విజన్‌ టీఎఫ్‌టీ డిస్ప్లేను ఇస్తున్నారు. ఆక్టాకోర్ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 662 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 197 పాయింట్ల లాభంతో 38,632 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 11,434 వద్ద కొనసాగుతున్నాయి. బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, ఈక్లెరిక్స్‌ సర్వీస్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అశోక్‌ బిల్డ్‌కాన్‌లు లాభాల్లో ఉండగా.. వాటెక్‌ వాబ్యాగ్‌, వార్రోక్‌ ఇంజినీరింగ్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, యస్‌బ్యాంక్‌ లిమిటెడ్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అదానీ గ్రూప్‌ ముంబయి ఎయిర్‌పోర్టులో 74 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో ఆ షేర్లు మంచి జోరుమీదున్నాయి.

* భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు 2025 నాటికి మూడింతలై రూ.7092 లక్షల కోట్లకు చేరుతాయని రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ నివేదిక అంచనా వేసింది. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వేగంగా పెరుగుతున్న డిజిటలీకరణ ఇందుకు తోడ్పడతాయని పేర్కొంది. 2019-20లో భారత డిజిటల్‌ చెల్లింపుల మార్కెట్‌ విలువ రూ.2162 లక్షల కోట్లుగా నమోదైంది. ‘ప్రస్తుతం ఉన్న 16.2 కోట్ల మంది మొబైల్‌ చెల్లింపుల వినియోగదారులు.. 2025 నాటికి 5 రెట్లు అధికమై దాదాపు 80 కోట్లకు చేరుతారు. ఈ వృద్ధికి పలు కారకాలు దోహదపడతాయి’ అని రెడ్‌సీర్‌ తెలిపింది. 2025కు మొత్తం చెల్లింపుల్లో మొబైల్‌ చెల్లింపుల శాతం దాదాపు 3.5 శాతం కానుంది. ప్రస్తుతం ఇది 1 శాతంగా ఉంది. ఇక డిజిటల్‌ చెల్లింపుల వృద్ధిలో వాలెట్లు కీలక పాత్ర పోషించడం కొనసాగనుంది. భారత్‌లో కొవిడ్‌-19 సంక్షోభం కూడా డిజిటల్‌ చెల్లింపులు పెరగడానికి తోడ్పడనుందని రెడ్‌సీర్‌ అభిప్రాయపడింది.

* 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మరిన్ని ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అభిప్రాయపడ్డారు. అగ్రగామి 100 అంతర్జాతీయ బ్యాంకుల జాబితాలో కేవలం ఒక్క భారతీయ బ్యాంకు మాత్రమే ఉందని, చిన్న దేశాల్లో పెద్ద బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అగ్రగామి 100 బ్యాంకుల జాబితాలో ఎస్‌బీఐ 55వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో 18 చైనా బ్యాంకులు, 12 అమెరికా బ్యాంకులు ఉన్నాయి. ‘భారత్‌ ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థ పరిమాణానికి అనుగుణంగా భారత బ్యాంకింగ్‌ రంగం లేదు. దక్షిణకొరియాలో ఆరు ప్రపంచస్థాయి బ్యాంకులు ఉండగా, భారత్‌లో ఒక్కటి మాత్రమే ఉంది’ అని సుబ్రమణియన్‌ అన్నారు. అగ్రగామి 100 బ్యాంకుల్లో ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, బెల్జియం, ఆస్ట్రియా, నార్వే వంటి చిన్న దేశాలకు చెందిన బ్యాంకులు ఉన్నాయని తెలిపారు.