DailyDose

రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యయత్నం-నేరవార్తలు

రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యయత్నం-నేరవార్తలు

* రవీంద్ర భారతి వద్ద ఆత్మహత్యయత్నం కలకలం..తెలంగాణ వచ్చిన తరువాత నాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటు పెట్రోల్ పోసుకున్నట్లు స్థానికుల వెల్లడి.జై తెలంగాణ అంటూ నినాదాలు.ఆత్మహత్యత్నం చేసుకున్న వ్యక్తి నాగులు తండ్రి పేరు రాములు కడ్తల్ గ్రామ వాసి…వెంటనే పసిగట్టి అప్రమత్తమైన పోలీసులు.మంటలు ఆర్పేసి హాస్పిటల్ కు తరలింపు..అపరిచిత వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది..ప్రయివేట్ టీచర్ గా అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు..విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు..ప్రత్యక్ష సాక్షి..కేసీఆర్ సర్ న్యాయం చేయమని బాధితుడు అరిచినట్టు సమాచారం..జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన వ్యక్తి..నిప్పంటించుకున్న వెంటనే మంటలు ఆర్పేసిన పోలీసులు..తనకు బతకడానికి పని లేదంటూ అరిచిన వ్యక్తి…సగం శరీరం కాలినట్టు తెలిపిన ప్రత్యక్ష సాక్షి..వెంటనే ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.

* తమిళనాడు రాజధాని చెన్నైలో గ్యాంగ్ వార్ ఓ రౌడీషీటర్ హత్యకు దారితీసింది. రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో రౌడీషీటర్ రమేష్‌ను మరో రౌడీ గ్యాంగ్ దారుణంగా కత్తులతో నరికారు. నగరంలోని పులియంతోపుకి చెందిన రౌడీ షీటర్ రమేష్ ప్రత్యర్ధులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతను మృతి చెందిన విషయం ఖరారు చేసుకున్న వెంటనే రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి పరారైంది.పలు హత్యలు, గంజాయి సరఫరా కేసులలో మృతుడు రమేష్ ప్రధాన నిందితుడని చెబుతున్నారు. నిన్న రాత్రి పులియంతోపులో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రౌడీ గ్యాంగుల మధ్య ఉన్న విభేదాలు, సెటిల్ మెంట్ల వ్యవహారాలే రమేష్ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో స్థానికులు భయంతో పరుగులు తీసినట్లు సీసీ పుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తోంది.

* వరుసకు కొడుకయ్యే వ్యక్తితో మహిళ రాసలీలలు.. ప్రియుడితో కలిసి భర్త దారుణ హత్యవివాహేతర సంబంధాలు ఉసురుతీస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ నేర ప్రవృత్తి ఎక్కువవుతోంది. సమాజంలో నానాటికీ విలువలు కొరవడుతున్నాయి. క్షణిక సుఖం కోసం వైవాహిక బంధాన్ని తెంచుకోవడమే కాదు.. హత్యలకు కూడా వెనుకాడటంలేదు. నిండు నూరేళ్లు తోడుగా ఉంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరచి, వివాహేతర సంబంధాల కోసం కట్టుకున్నవారినే కడతేర్చుతున్నారు. తాజాగా, ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్యచేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. భర్త గాఢనిద్రలో ఉన్నప్పుడు అతడిపై కర్ర, కత్తితో దాడిచేసి హత్యకు పాల్పడింది.తూర్పుగోదావరి హత్యకేసుపోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలం చింతలూరులో జంకల అప్పారావు అలియాస్‌ వరహాలు(35) తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. వేరే వ్యక్తితో వరహాలు భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, ఈ విషయం అతడికి తెలిసి మందలించాడని తెలిపారు. అంతేకాదు, అతడు వరుసకు కొడుకు కావడంతో అప్పారావును మరింత వేదనకు గురిచేసిందని అన్నారు.

* మెదక్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఐదుగ్గురు అరెస్ట్.మెదక్ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఇంకా కొనసాగుతూనే ఉన్న ఏసీబీ సోదాలు.ఆర్డీవో అరుణా రెడ్డి, ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసిమ్ హైమ్మద్,జీవన్ గౌడ్ లను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రధాన కార్యాలయం కు తీసుకొచ్చిన ఏసీబీ.మరికొద్ది సేపట్లో మెదక్ ఇంచార్జ్ కలెక్టర్ నగేష్ ను ఏసీబీ కార్యాలయంకు తీసుకు రానున్న ఏసీబీ.నగేష్ ఇంట్లో జరిపిన సోదాల్లో భూ డాక్యుమెంట్లు, బినామి పేర్ల మీద ఆస్తులను గుర్తించిన ఏసీబీ.విఆర్ఓ , విఆర్ఏ పాత్ర పై ఆరా తీస్తున్న ఏసీబీ.అరెస్ట్ చేసి ఐదుగురు నిందితులను నేడు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్న ఏసీబీ.112 ఎకరాల విస్తీర్ణంలో భూమి ణోఛ్ ఇవ్వడం కోసం లంచం డిమాండ్.ఎకరాకు లక్ష చొప్పున 1 కోటీ12లక్షలు లంచం డిమాండ్.మొదటగా రెండువిడతల్లో 19.5 లక్షలు, మరో సారి 20.5 లక్షలు లంచం తీసుకున్న అడిషనల్ కలెక్టర్ నగేష్ .మిగిలిన 72 లక్షలకు గాను 5 ఎకరాల భూమిని నగేష్ బినామీ జీవన్ గౌడ్ కి సేల్ అగ్రిమెంట్ .భూమి రిజిస్ట్రేషన్ అయ్యేవరకు షూరిటీ కోసం బాధితుడు నుండి 8 ఖాళీ చెక్కులు తీసుకున్న అడిషనల్ కలెక్టర్.జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్ ఫిర్యాదుదారు నుండి 5 లక్షలు వసూలు.ఆర్డీవో అరుణా రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 28 లక్షలు నగదు, అర కిలో బంగారం స్వాధీనం.నగేష్ ఇంట్లో అగ్రిమెంట్ సెల్ డాక్యుమెంట్స్, చెక్స్ స్వాధీనం.ఆడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ.

* ఇడ్లీ తినలేదని ఐదేళ్ల బాలికను హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… కళ్లకురిచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపం మెల్‌విళి గ్రామానికి చెందిన రోసారియో, జయరాణి దంపతులకు రెన్సీమేరీ (5) అనే కుమార్తె ఉంది. మూడేళ్ల కిత్రం జయరాణి మృతిచెందడంతో రోసారియో మరో మహిళను వివాహం చేసుకొని వేరుగా ఉండడంతో, బాలిక రెన్సీమేరీ జయరాణి తల్లి పచ్చయమ్మాళ్‌ ఇంట్లో ఉంటుంది. అక్కడ జయరాణి అక్క ఆరోగ్యమేరీ కూడా ఉంటుంది. ఆరోగ్యమేరీకి ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవు, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోసాగింది.

* చిలకలూరిపేటలో శానిటైజర్ తాగి వ్యక్తి మృతి. చిలకలూరిపేటలో శానిటైజర్ తాగి పచ్చల బాలాస్వామి (37) అనే వ్యక్తి మృతి చెందాడు.

* గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీని మోసగించబోయిన ఒక ఘరానా మోసగాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వ్యవహారంలో తోట బాలాజీనాయుడు అలియాస్ బాబూ జగ్జీవన్ రావును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎమ్మెల్యే విడదల రజిని గుంటూరులోని రవీంద్రనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆమెకు మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ఫోన్ చేసి తన పేరు బాబూ జగ్జీవన్ రావు అని, సచివాలయంలో పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు.నియోజకవర్గానికి రూ.2 కోట్ల వంతున కొవిడ్ నిధులు మంజూరయ్యాయని, ఇవి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల వంతున రుణాల రూపంలో ఎనిమిది మందికి మంజూరు చేస్తారని నమ్మబలికాడు. ఒక్కో లబ్ధిదారుడు రూ.50,000 వంతున నగదు చెల్లించాలని, ఎనిమిది మందికి కలిపి రూ.4 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా అర గంటలో తన ఖాతాకు పంపాలని, లేదంటే రుణాలు చిలకలూరిపేట నియోజకవర్గానికి దక్కకుండా పోతాయని చెప్పాడు. సదరు వ్యక్తి మాయమాటలు నమ్మిన ఆమె ఒక దశలో రూ.4 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.