Politics

ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల నేరచరిత్రను ప్రసారం చేయాల్సిందే!

ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల నేరచరిత్రను ప్రసారం చేయాల్సిందే!

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర మార్గదర్శకాలను ప్రకటించడం గురించి 2018 అక్టోబర్ 10, 2020 మార్చి 6 తేదీల్లో జరిగిన వాదనల క్రమంలో భారత ఎన్నికల కమిషన్ (సీఈఐ) శనివారం సమావేశమైంది.

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే సమయంలో పార్టీలు, అభ్యర్థుల తమ నేర చరిత్రను ప్రకటించే విషయంలో మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ నిర్ణయించనుంది.

భారత ప్రజాస్వామ్యం, ఎన్నికలు మరింత పారదర్శకంగా ఉండాలనే ఈ విషయంపై కమిషన్ పలు మార్పులు చేస్తున్నది. 
 
నేర చరిత్ర వివరాల ప్రకటనకు సవరించిన మార్గదర్శకాలు:

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులను నియమించే విషయంలో అభ్యర్థులకు  నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను వార్తా పత్రికల్లో ప్రచురించడం తోపాటు ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయాలి

1.  మొదటి ప్రసారం: నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీకి ముందు నాలుగు రోజుల్లోగా ప్రసారం చేయాలి. 

2 .రెండవ ప్రసారం: నామినేషన్ ఉపసంహరణకు 5వ రోజు నుంచి 8వ రోజు లోపల ప్రకటించాలి.

3.మూడవ ప్రసారం: ఎన్నికల ప్రచారం ఆఖరు రోజుకు 9వ రోజు వరకు అనగా పోలింగుకు రెండు రోజుల ముందు వరకు ప్రసారం చేయాలి. ఈ సమయం ఓటర్లు అభ్యర్థులను ఎంచుకోవడంలో మరింత సమాచారాన్ని అందజేస్తుంది.

4. పోటీ చేయకుండానే గెలిచే అభ్యర్థులు , వారిని నియమించే రాజకీయ పార్టీలు ఆయా అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించే విషయంలో,  రాజకీయ పార్టీలు ఆయా అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లైతే  ఆ  వివరాలు ఇతర పార్టీల వారికి తెలుపాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు కమిషన్ ఈ విషయంలో తీసుకున్న అన్ని నిర్ణయాల సారాంశాలను సంబంధిత వ్యక్తుల లబ్ది కోసం ప్రచురించవలసిందేనని తెలిపింది.

ఈ విషయానికి సంబంధించిన అభ్యర్థుల వివరాలను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు స్వయంగా ప్రకటించ వలసి ఉంటుంది.

ఈ సవరించిన ఈ నిబంధనలు వెంటనే అమల్లోనికి వస్తాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.