Agriculture

సాగర్ వద్ద ఉద్ధృతంగా ప్రవాహం

సాగర్ వద్ద ఉద్ధృతంగా ప్రవాహం

అల్పపీడన ద్రోణీ ప్రభావంతో రాష్ట్రం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పొటెత్తుతుంది. మరోవైపు ఎగువ నుండి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 8 క్రస్ట్ గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 309.6546 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 1,54,878 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.20 అడుగుల మేరకు నీటి మట్టం ఉంది.