DailyDose

ప్రేయసిని కాల్చి మామను చంపిన ఎస్ఐ-నేరవార్తలు

ప్రేయసిని కాల్చి మామను చంపిన ఎస్ఐ-నేరవార్తలు

* దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోరం జ‌రిగింది. ఢిల్లీలోని ల‌హోరి గేట్ పోలీసు స్టేష‌న్ ఎస్ఐ సందీప్ దాహియా.. త‌న ప్రియురాలిపై కాల్పులు జ‌రిపి.. అనంత‌రం పిల్ల‌నిచ్చిన మామ‌ను చంపేశాడు. ఢిల్లీ అలీపూర్ ఏరియాలో ఆదివారం రాత్రి దాహియా త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌తో క‌లిసి కారులో బ‌య‌ల్దేరాడు. ఆ త‌ర్వాత ఇద్ద‌రికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవ‌డంతో.. ఆమెపై స‌ర్వీస్ రివాల్వ‌ర్ తో కాల్పులు జ‌రిపి పారిపోయాడు. అనంత‌రం త‌న భార్య ఇంటికి చేరుకున్న దాహియా.. అక్క‌డ మామ‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌ను చనిపోయాడు. దాహియా గ‌త కొన్నేళ్ల నుంచి త‌న భార్య‌కు దూరంగా ఉంటున్నాడు. కొద్ది కాలం నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయి. అంత‌లోనే దాహియాకు మ‌రో యువ‌తి ప‌రిచ‌యం కావ‌డంతో ఆమెతో స‌న్నిహితంగా ఉంటున్నాడు. అయితే ఈ కేసులో దాహియా ప‌రారీలో ఉన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గాయ‌ప‌డ్డ బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెప్పారు.

* పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెం గ్రామంలో దారుణం. ఇద్దరు మైనర్ లకు వివాహం చేసిన గ్రామపెద్దలు.

* గుట్కా జర్దా ప్యాకెట్లు పట్టుకున్నా సందర్భంలో తమ వారిని విడిచి పెట్టాలని అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ పైకి దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు పోలీస్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో పోలీసులు గుట్కా జర్దా నిషేధిత ప్యాకెట్లను పట్టుకున్నారు అయితే కొందరు వ్యక్తులు మద్యం మత్తులో ఏకంగా పోలీస్ స్టేషన్ పైకి దాడికి యత్నించారని మద్యం మత్తులో ఎజాజ్ అలీ,ఘోర అజ్జు,అనే వ్యక్తులు మరి కొంతమందిని తీసుకొచ్చి మీరు గుట్కాలు ఎలా పట్టుకుంటారని పోలీసులతో ఘర్షణ పడ్డారని పోలీసులు ఎంత నచ్చచెపినా వినకుండా అర్ధరాత్రి నానా హంగామా సృష్టిచినట్లు తెలుస్తోంది.

* పోలీసులమని చెప్పి దుండగులు ఓ లారీ డ్రైవర్ వద్ద భారీ‌‌గా డబ్బుల వసూలు చేసి పరారైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.  మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుమంటూ లారీ డ్రైవర్ నుంచి దుండగులు రూ.1,15,000ను వసూలు చేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ.. రైలును ఢీకొని దుర్మరణం పాలైన వ్యక్తి సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో రైల్వే ట్రాక్ పై ఈ సంఘటన చోటు చేసుకుంది.

* చిత్తూరు జిల్లా మదనపల్లె జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై జరిగిన దాడిలో రాజకీయ కోనం లేదని జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ పేర్కొన్నారు.

* రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులకు తోడు మోసాలు కూడా మొదలయ్యాయి. జిల్లాలో కొత్తగా దొంగబాబాలు ప్రత్యక్షమయ్యారు. ‘మృత్యుదేవత తిష్టవేసింది. శాంతి హోమం చేయాలి’ అంటూ వేలాది రూపాయలు దండుకొని మాయమవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇళ్లలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడు తున్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో వారం రోజులుగా ఇలాంటి మోసాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. కాషాయదుస్తులు, ముఖాన తిలకాలతో దొంగ బాబాలు జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. ఇంట్లో మగవాళ్లు లేకపోవడం గమనించి అమాయకంగా ఉండే మహిళలను గుర్తించి వారి వద్ద ప్రత్యక్షం అవుతు న్నారు. ‘ఇంట్లో మృత్యుదేవత తిష్ట వేసింది.

* గత ఐదు రోజుల క్రితం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా కాలనీకి చెందిన సయ్యద్ మెయిన్(24) అనే యువకుడి హత్య కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు.