WorldWonders

మట్టి తింటున్న ఆవులు

మట్టి తింటున్న ఆవులు

మన్ను తిన్న కన్నయ్య గురించి విన్నాం! ఆ గోపాలుడిలాగే ఈ గోవులు మన్నును తింటున్నాయి. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, జానాలగూడెం నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో కొన్ని పశువులు ఇలా మట్టిని తింటున్నాయి. చుట్టూ పచ్చదనం ఉన్నా వీటి మనసు మాత్రం మట్టి మీదే ఉంటోంది. జన్యుపరమైన లక్షణాలకు తోడు.. సరైన పోషకాలు అందకపోవడంతో మట్టితోపాటు ఏది పడితే అది తింటాయని, దీన్ని పైకా బిహేవియర్‌ అంటారని కొత్తపల్లి పశువైద్యాధికారిణి భువనేశ్వరి తెలిపారు.