Devotional

రేపటి నుండి తుంగభద్ర పుష్కరాలు

Thungabhadra Pushkaram 2020 Details In Andhra

ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుండి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:21 గంటలకు ప్రారంభం అవుతాయి. రేపటినుండి మొదలుకొని డిసెంబర్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజులపాటు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు కేటాయించింది. తుంగభద్ర నదీ పరివాహ ప్రాంతాల్లో 21 ఘాట్లను ఏర్పాటు చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పుష్కరాలు జరిగేలా ఏర్పాట్లు చేసింది. కాగా తెలంగాణ సర్కార్ పుష్కర ఘాట్ల దగ్గరకు భక్తులు కరోనా నెగిటివ్ రిపోర్ట్ తో రావాలని సూచనలు చేసింది. కరోనా రిపోర్ట్ లేని పక్షంగా థర్మల్ స్క్రీనింగ్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి అధికారులు అనుమతి ఇవ్వనున్నారు.ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని పుష్కర ఘాట్లలోకి అనుమతించరు. ప్రభుత్వం 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలు, 65 సంవత్సరాల వయస్సు పై బడిన వృద్ధులు, గర్భిణీలు పుష్కరాలకు రావొద్దని సూచనలు చేసింది.