DailyDose

పవన్ పర్యటనలో అపశృతి-నేరవార్తలు

పవన్ పర్యటనలో అపశృతి-నేరవార్తలు

* పామర్రు మండలం కనుమూరు వద్థ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ర్యాలీలో అపశృతి.రెండు కార్ల మధ్య ఇరుక్కున్న బైక్.బైక్ పై వున్న వ్యక్తి కి విరిగిన కాలు.

* విశాఖ నగరంలో దారుణం ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ప్రియాంక మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో శ్రీకాంత్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది.దాడి అనంతరం ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాడు.వారితో మాట్లాడుతూనే అదే కత్తితో తనను తాను గాయపరచుకున్నాడు.ఈ హఠాత్పరిణామంతో స్థానికులు షాకయ్యారు.

* గుంటూరు జిల్లా సత్తెనపల్లి పౌరసరఫరాల గోదాంలో విజిలెన్స్ తనిఖీలు.రేషన్ షాపుకు సరఫరా చేసే సరుకుల బరువులో వ్యత్యాసం ఉండటం వల్ల MLS పాయింట్ ను తనిఖీ చేసిన అధికారులు స్టాక్ లో వ్యత్యాసం. 12 (6 క్వింటాలు)బస్తాల బియ్యం తక్కువ. 2 (1 క్విట) బస్తాల పంచదార ఎక్కువ.గోడం ఇన్చార్జి పై చర్యలు తీసుకోనున్న అధికారులు.

* కడప జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్స్ పై జిల్లా ప్రత్యేక పోలీస్ బృందాల దాడులు..నాలుగు టన్నుల బరువున్న 98 ఎర్రచందనం దుంగలు పట్టివేత..బెంగళూరు కేంద్రంగా స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు కీలక స్మగ్లర్లు అర్ఫాజ్ ఖాన్, ఖాలీల్ ఖాన్ అరెస్ట్..వీరితోపాటు కడప జిల్లాలో గ్యాంగ్స్ లోని 28 మంది అరెస్ట్..ఐదు వాహనాలు, కటింగ్ మిషన్ స్వాధీనం..

* నెల్లూరు విద్యుత్ శాఖ ఎస్ఈ విజయ్ కుమార్ రెడ్డి ఇంటి పై ఏసీబీ అధికారులు దాడులు..ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో దాడులు చేస్తున్న అధికారులు..చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో పలు డాక్యుమెంట్ లు పరిశీలన .