DailyDose

జాతీయహోదా కావాలని తితిదే విజ్ఞప్తి-తాజావార్తలు

Breaking News - TTD Writes To Central Govt For National Status

* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి డా. రమేష్ పోఖ్రియాల్‌ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సుబ్బారెడ్డి వినతిపత్రం అందజేశారు. 2006లో తితిదే ఆధ్వర్యంలో వేద విద్య వ్యాప్తి, పరిరక్షణ కోసం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. 2007లో రాష్ట్ర విశ్వవిద్యాలయంగా యూజీసీ గుర్తించిందన్నారు. వేదాలకు సంబంధించి డిగ్రీ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ కోర్సులు నడుపుతున్నట్లు వివరించారు. అంతేకాకుండా వేద విద్యను ప్రోత్సహించేందుకు సొంతంగా వేద పాఠశాలలు నడపడమే కాకుండా దేశవ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు సుబ్బారెడ్డి లేఖలో పేర్కొన్నారు.

* కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగిచేందుకు తొలి టీకా తానే తీసుకుంటానని అంటున్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ. ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి విడత టీకాలను ఇజ్రాయెల్‌ నేడు అందుకుంది. టెల్‌ అవివ్‌ సమీపంలోని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మహమ్మారి ముగింపు కనుచూపు మేరలో కన్పిస్తోంది. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించడమే నా ప్రథమ ప్రాధాన్యం. టీకా విషయంలో ప్రజలకు నేను ఉదాహరణలా నిలవాలనుకుంటున్నా. అందుకే దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంకాగానే తొలి టీకా నేను తీసుకోవాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

* కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టంచేశాయి. చట్టాలను రద్దు చేసే యోచన లేదని, సవరణలకు సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను కేంద్రం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు తమ వైఖరిని కేంద్రానికి తెలియజేశాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని పునరుద్ఘటించాయి. ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని సుస్పష్టంగా ప్రకటించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* కొవిడ్‌ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యకు చెక్‌ పెట్టి కొత్తగా ఉద్యోగాలు సృష్టికి ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన’ పథకానికి కేంద్రం నిధులు కేటాయించింది. ఈ పథకం అమలుకు రూ.22,810 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,584 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనలో భాగంగా కొత్తగా ఉద్యోగాలు కల్పించిన సంస్థలు, పరిశ్రమల తరఫున ఉద్యోగి, సంస్థ వాటాను కేంద్రమే భరిస్తుందని, 2023 వరకు ఈ పథకం అమలు చేస్తామని సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రైతులపై సీఎం కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.125కోట్లు విడుదల చేసినా ఆ నిధులు ఎక్కడికెళ్లాయో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెరాస నేతలు కృత్రిమ ఉద్యమం చేశారని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* వ్యవసాయ చట్టాలపై రాష్ట్రపతితో విపక్ష నేతల సమావేశం ముగిసింది. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చూడాలని ఐదుగురి సభ్యులతో కూడిన విపక్ష నేతల బృందం రాష్ట్రపతిని కోరింది. వ్యవసాయ చట్టాలపై రైతుల పోరాటాన్ని రాష్ట్రపతికి వివరించినట్టు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. వీటిని ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. చట్టాలను రద్దుచేసే వరకు అన్నదాతలతో కలిసి పోరాడతామని ఆయన స్పష్టంచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల టేక్‌ హోమ్‌ శాలరీ (నెలవారీ చేతికొచ్చే మొత్తం)లో కోత పడనున్నట్టు సమాచారం. నూతన వేతన నిబంధన- 2019 వల్ల ఈ మార్పు చోటుచేసుకోబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించరాదు. దీంతో మూల వేతనాన్ని (బేసిక్‌ పే) 50 శాతంగా నిర్ణయించాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ కీలక భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటమి, టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ రాజీనామా నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో పార్టీ నేతలతో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్‌ వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగిచేందుకు తొలి టీకా తానే తీసుకుంటానని అంటున్నారు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ. ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి విడత టీకాలను ఇజ్రాయెల్‌ నేడు అందుకుంది. టెల్‌ అవివ్‌ సమీపంలోని ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో చేరుకున్న టీకాలను నెతన్యాహూ స్వయంగా వెళ్లి పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* కొవిడ్‌ బాధితుల్లో కొంతమంది తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతుంటే, మరికొందరిలో అసలు వైరస్‌ సోకిన లక్షణాలే కనిపించటం లేదు. మరి వైరస్‌ తీవ్రతలో ఇంతటి వైవిధ్యానికి కారణం ఏమిటీ? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయం గురించి పరిశోధకులు ఏమంటున్నారు? కరోనా వైరస్‌ తీవ్రత వెనుక జన్యుపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయట. బెత్ ఇజ్రాయెల్ డీకనెస్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు కొవిడ్‌ తీవ్రతలో హెచ్చుతగ్గులకు జన్యుపరమైన అంశాలకు మధ్యం సంబంధం ఉందని పేర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఉదయం నుంచి మరో 18 మంది అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. ఇప్పటివరకు 503 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 58 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలినవారికి గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* సిద్దిపేటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రాంతానికి ‘కేసీఆర్‌ నగర్‌’ అని నామకరణం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రేపు సిద్దిపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్‌ అక్కడ నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి