Politics

తడాఖా చూపిస్తున్న నిమ్మగడ్డ. తొమ్మిది మంది అధికారులపై వేటు-తాజావార్తలు

తడాఖా చూపిస్తున్న నిమ్మగడ్డ. తొమ్మిది మంది అధికారులపై వేటు-తాజావార్తలు

* ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికల విధుల నుంచి తొమ్మిది మంది అధికారులను తప్పిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు ఉన్నారు. ఈమేరకు తప్పించిన అధికారుల వివరాలను సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఎస్‌ఈసీ లేఖ ద్వారా పంపించారు.

* ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం.దీంతో ఆయన కుమార్తె మీసా భారతి లాలూ చికిత్స పొందుతున్న రిమ్స్‌కు చేరుకున్నారు.మీసాతో పాటు ఆయన భర్త రబ్రీ దేవి, కుమారులు తేజస్వీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఆయన రాంచీలోని రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.లాలూకు కరోనా లక్షణాలు కనిపించడంతో యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటీవ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా..? అనేదానిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు.శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది తప్పనిసరిగా టెన్త్‌ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.మే నెలలో టెన్త్‌ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు.వారం రోజుల్లో పదవతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.అయితే.. 11 పేపర్లా లేదా 6 పేపర్లా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సురేష్.

* ఫిబ్రవరి 11న జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికజీహెచ్​ఎంసీ నూతన మేయర్​ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది.ఫిబ్రవరి11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

* శాంత బ‌యోటెక్ ఛైర్మ‌న్ కెఐ.శివ‌ప్ర‌సాద్ రెడ్డి శుక్ర‌వారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ మేర‌కు విరాళం డిడిని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు సుబ్బారెడ్డికి అంద‌జేశారు.

* ఇంటింటికీ ఇంటర్నెట్‌పై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

* వింతవ్యాధిపై సీఎం జగన్ వెంటనే స్పందించారని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ తెలిపారు.క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.కొమిరేపల్లిలో తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించామన్నారు.ఇప్పటివరకు 22 కేసులు వచ్చాయని, పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు.వ్యాధి ఎందుకు వస్తుందో కారణాలు అన్వేషిస్తున్నామని చెప్పారు.గతంలో ఏలూరుకు సంబంధించి రిపోర్టులు వచ్చాయని, కొమిరేపల్లికి సంబంధించి సీఎంకు నివేదిక ఇస్తామని ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు.జిల్లాలో వింత వ్యాధి తగ్గుముఖం పట్టింది. పూళ్ళ, భీమడోలు, గుండుగొలనులలో గురువారం ఒక్క కేసు నమోదు కాలేదు.

* తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించింది.ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఊపిరితిత్తులు బాగా దెబ్బ తిన్నాయని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.గురువారం నిర్వహించిన సీటీ స్కాన్‌ పరీక్షల్లో శశికళ కు కరోనా నిర్ధారణ అయ్యింది.శశికళ కు రక్తపోటు, మధుమేహం సమస్యలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

* సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్‌ గొగొయ్‌కి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ వీఐపీ భద్రతను కల్పించింది. దీంతో ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ సాయుధ కమెండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయనకు ఈ భద్రత ఉండనుంది. గతంలో దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. అయితే, 2019 నవంబర్‌లో ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అనంతరం రాజ్యసభకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన వీఐపీ భద్రతా విభాగం నుంచి ఆయనకు కమాండోలతో భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 8 మంది నుంచి 12 మంది సీఆర్‌పీఎఫ్‌ కమాండోలతో కూడిన మొబైల్‌ టీం ఆయనకు నిరంతరం భద్రతగా ఉండనుంది.

* తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇటీవల మృతిచెందిన ఏనుగు చెవి భాగానికి నిప్పు గాయం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నీలగిరి జిల్లాలోని టైగర్‌ రిజర్వులోని ఓ ఏనుగు వీపునకు గాయం ఉండటంతో అటవీశాఖ అధికారులు దానికి వైద్యచికిత్సలు అందించి పర్యవేక్షించారు. నీలగిరి జిల్లా మసినకుడి ప్రాంతంలోని జనావాసాల్లో తిరుగుతున్న ఆ ఏనుగును ఈనెల 19న రిజర్వు ప్రాంతానికి తరలిస్తుండగా మరణించింది. అయితే ఏనుగు చెవి భాగంలో నిప్పుతో చేసిన గాయం ఉండటాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో టైరుకు నిప్పు పెట్టి దానిని ఏనుగు మీదకు విసిరే దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. జనావాసాల్లో తిరుగుతున్న ఏనుగును తరిమే ప్రయత్నంలో ఇలా చేశారా? లేక వేరే ఏదైనా కారణంతో ఇలా చేశారా? అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

* బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్‌ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్‌ న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు పిటిషన్‌పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.

* ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో దొంగల ముఠా పట్టపగలే రెచ్చిపోయింది. తమిళనాడులోని హోసూరులో ఉదయం 9.30గంటల సమయంలోనే స్థానిక ముత్తూట్‌ ఫైనాన్స్‌లోకి చొరబడి భారీ చోరీకి పాల్పడింది. శుక్రవారం ఉదయం కార్యాలయం తెరుచుకున్న కొద్దిసేపటికి ఆరుగురు దుండగులు ఈ ప్రైవేటు బంగారు రుణాల ఫైనాన్సింగ్‌ సంస్థ కార్యాలయంలోకి చొరబడి 25కిలోలకు పైగా బంగారం ఎత్తుకెళ్లారు. దీని విలువ రూ.7.5కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పాటు లాకర్లలో ఉన్న రూ.96వేల నగదు కూడా దోచుకెళ్లినట్టు ముత్తూట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది తెలిపారు.

* భాజపా ఆందోళనల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేంద్రం ఎప్పటి నుంచో అమలు చేస్తున్నా రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రెండేళ్లుగా వేలాది మంది అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల ఫలాలు దక్కలేదని బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.