DailyDose

ఏనుగుల దాడితో విలవిలలాడుతున్న రైతన్నలు-నేరవార్తలు

ఏనుగుల దాడితో విలవిలలాడుతున్న రైతన్నలు-నేరవార్తలు

* చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం:సరిహద్దు దాటాని 14 ఏనుగుల గుంపు…అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలను తిప్పి కొడుతున్న గజరాజులు…నెల్లిపట్ల గ్రామంలోని టి. సుబ్రమణ్యం అనే రైతన్న రెండు ఎకరాల చెరుకు తోటలోరాత్రి 14 ఏనుగులు పడి పూర్తి ధ్వంసం చేసిన ఘటన నెల్లిపట్ల లో చోటు చేసుకుంది. అదేవిధంగా పి.కృష్ణప్ప అనే రైతన్న బోరునుకూడ పేకళించిన ఘటన చోటుచేసుకుంది.గ్రామ సరిహద్దుల్లో తిష్ట వేసి,రాత్రి సమయాల్లో పొలాల్లోకి చొరబడి పంట చేతి కందే సమయంలో ఏనుగులు నష్టం చేకురుస్తున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు.ఏనుగుల బారి నుండి కాపాడి,వాటికి శాశ్విత పరిస్కారం చేపట్టి ,నష్ట పరిహారం అందేలా తగు సంబంధిత అధిజారులు చూడాలని రైతన్నలు కోరుతున్నారు.

* సత్తెనపల్లి శ్రీరామ్ చిట్స్ వెనక వీధిలో తోకల రమేష్ అనే వ్యక్తి మృతి..కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకోని ఆత్మహత్య..మృతుడు రమేష్ రాజుపాలెం డిప్యూటీ తాహశీల్ధార్ భర్త.

* కృష్ణా జిల్లాలోని బందరు రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.తనిఖీలలో భాగంగా బందరు రోడ్డులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 1.74 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనధికారంగా బంగారాన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించారు.నిందితులు మధ్యప్రదేశ్, రాజస్థాన్‎కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

* విజయనగరం:జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంపతులు చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.అర్దరాత్రి ఒంటి గంట సమయంలో బాత్ రూమ్‎లోకి వెళ్లిన భార్య ఒక్కసారిగా బాత్ రూమ్‎లోనే కుప్పకూలింది. భర్త వెళ్లి చూసేసరికి..అప్పటికే మృతి చెందింది.భార్య సూర్యప్రభ హఠాన్మరణంతో షాక్‎కు గురైన భర్త మనోహర్‎కు..అరగంట వ్యవధిలోనే గుండెపోటు వచ్చింది.దీంతో మనోహర్ అక్కడున్న బంధువులు ఆస్పత్రికి తరలించే క్రమంలోనే ప్రాణాలు విడిచాడు.ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని ఎస్.కోటలో చోటుచేసుకుంది.మనోహర్ ఎస్.కోటలోని ఎల్ఐసిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.తల్లిదండ్రుల మృతితో కుమారుడు లికిత్ ఒంటరివాడయ్యాడు. ఈ విషాదంతో వారి బంధువులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

* మచిలీపట్నం మండలం‌ కోన గ్రామంలో దారుణం…ఆటో ఎక్కిన యువతిని బలవంతంగా గదిలో బంధించి అత్యాచారం…నిందితునికి సహకరించిన సోదరుడు…..పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.

* తాడేపల్లి…కలకలం రేపుతున్న గోడపై రాతలు…చంద్రబాబుకు వ్యతిరేకంగా బోటుయార్డు వద్ద గోడ పై రాతలు రాసిన గుర్తు తెలియని వ్యక్తులు…”చంద్రబాబు కపట నాటకాలు ఆపి రాజధానిలో SC,ST,BC, లకు ఇచ్చే ఇళ్ల స్థలాలకు అడ్డు తొలగాలి” అంటూ గోడపై రాతలు…గోడపై రాసిన రాతలపై ఆరా తీస్తున్న పోలీసులు, ఇంటిలిజెన్స్ వర్గాలు..గోడపై రాసిన రాతలను నల్లరంగు వేసి చెడిపేస్తున్న టీడీపీ శ్రేణులు.

* ఎన్ .ఏడీ ఫ్లేవర్ వంతెన పై లారీ డీ కొని పెయింటర్ మృతి ….నూతనంగా నిర్మించిన ఫ్లేవర్ వంతెన పై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్ ప్రమాదంతో పెయింటర్ ఒకరు మృతి చెందారు .ప్రమాదానికి సంబందించి వివరాలు ఇలా వున్నాయి .గాజువాక నుండి ఆర్ .అండ్ .బి కూడలి వైపుగా వస్తున్న లారీ ఎన్ .ఏడీ కూడలి ఫ్లేవర్ వంతెన పై కి వచ్చే క్రమంలో ఫ్లేవర్ వంతెన కు వెలుపల పెయింటింగ్ వేస్తున్నా కార్మికుడు పైకి దూసుకు పొయింది .దింతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు .విశయం తెలుసుకున్న కంచరపాలెం సి.ఐ కృష్ణ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు .ప్రమాదంతో మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.