Politics

గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల-తాజావార్తలు

గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల-తాజావార్తలు

* In Gujarat, notification for 2021 local body elections was released amidst covid vaccination schedule across the state. There is no threat to democracy n constitution in Gujarat by the govt employee union leaders.

* నేపాలీ జాతీయురాలు ఖమ్మంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందులో విచిత్రం ఏముందని.. ఖమ్మంలో నివసించే నేపాలీ మహిళ ఆస్పత్రిలో ప్రసవించి ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఈ ప్రసవం వెనుక ఎంతో ప్రయాస దాగి ఉంది. కొన్ని శాఖలు సత్వరం స్పందించి, సమన్వయంతో పని చేసిన తీరు ఉంది. ఫలితంగా ఓ విదేశీ మహిళకు ఎలాంటి అపాయం జరగకుండా క్షేమంగా ప్రసవం జరిగింది. విదేశీయుల విషయంలో ఇక్కడి అధికారుల అప్రమత్తత, వారు సాయం చేసే తీరు.. కచ్చితంగా కొనియాడదగినదేనని ఈ ఘటనతో నిరూపితమైంది.

* శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌.

* లాక్‌డౌన్‌ ప్రభావంతో నిలిచిపోయిన కృష్ణా ఎక్స్​ప్రెస్​ తిరిగి పట్టాలెక్కనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి సర్వీసు ప్రారంభం కానుంది. దాదాపు 10 నెలల విరామం అనంతరం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది.

* ఉత్తరాఖండ్‌లో జరిగే కుంభమేళా నిర్వహణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. హరిద్వార్‌లో 48 రోజులపాటు జరిగే కుంభమేళాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేస్తుంది. దీనిలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. భక్తులు తమ స్వరాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం/జిల్లా ఆసుపత్రి/వైద్య కళాశాల నుంచి మెడికల్ సర్టిఫికేట్‌ను పొందాలి. ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ మాట్లాడుతూ, గతంలో కుంభ మేళాను మూడున్నర నెలలపాటు నిర్వహించేవారమని, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో 48 రోజులకు కుదించామని చెప్పారు. భక్తులు కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. భక్తులు ముందుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని, తమ స్వరాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం/జిల్లా ఆసుపత్రి/వైద్య కళాశాల నుంచి మెడికల్ సర్టిఫికేట్‌ను పొందాలని తెలిపారు.

* వేతన సవరణ, సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వేతన సవరణ సంఘం కొద్దిరోజుల క్రితం సీఎంకు నివేదిక సమర్పిచింది. నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్‌.. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.

* అసోంలో రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం కోక్రఝర్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో వెల్లడించారు. ‘కేవలం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రమే అసోంను అవినీతి, ఉగ్రవాద, కాలుష్య రహితంగా మార్చగలదు. అసోంలో రాబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక పోరాటాలకు ముగింపు పలుకుతూ గతేడాది బోడోలాండ్‌ ప్రాదేశిక ఒప్పందం జరిగింది. గతంలోని ప్రభుత్వాలు కూడా బోడో పోరాట సంఘాలతో ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కానీ వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యాయి’ అని షా విమర్శించారు.

* పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిపే బెంచ్‌ మారింది. తొలుత జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ఈ పిటిషన్‌ ఉండగా.. తాజాగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్‌ బెంచ్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. ఏపీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉద్యోగ సంఘాలు సైతం వేరే పిటిషన్‌ దాఖలు చేశాయి.

* జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించారు. భాజపా, జనసేనలో ఏ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారనేది తమకు ముఖ్యం కాదని.. ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతామని సోమువీర్రాజు పునరుద్ఘాటించారు. ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జనసేన కూటమి సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీనికి తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని.. కుల, మత, వర్గ బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలసి పనిచేస్తామని సోము వీర్రాజు తెలిపారు.

* సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష నేతలు వెల్లడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్‌, తెదేపా, తెజస, సీపీఎం, సీపీఐ నేతలు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా చేయాల్సిన కార్యాచచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. దిల్లీ పర్యటన అనంతరం సాగు చట్టాలపై సీఎం కేసీఆర్‌ మాట మార్చారని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను సత్వరమే రద్దు చేయాలని.. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు.

* తెలంగాణలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే అధికారాలను తహసీల్దార్లకే కాకుండా ఆర్డీవోలకూ అప్పగించాలన్నారు. తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్‌ నూతన డైరీ, క్యాలెండర్‌ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లపైనే దృష్టి సారించడంతో విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు రావడానికి ఆలస్యమవుతోందన్నారు. నిత్యం రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం టార్గెట్లుపెట్టడంతో తహసీల్దార్లు పూర్తిగా దానికే సమయం వెచ్చిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పే ప్రభుత్వం.. అదనపు భారం మోపుతూ తహసీల్దార్లు, వీఆర్వోలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆక్షేపించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వీఆర్వోలు ఏ శాఖలో ఉన్నారో కూడా తెలియని అమోమయ స్థితి నెలకొందన్నారు.రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి విమర్శించారు.

* దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్‌ఈసీ విభేదించిన సందర్భాలు లేవని.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కావాలనే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎస్‌ఈసీ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని కోరామే తప్ప.. ఎన్నికలకు భయపడికాదన్నారు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలను వాయిదా వేస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు రోజా తెలిపారు.

* కొడంగల్ అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కొడంగల్ అభివృద్ధైనా, ఆత్మగౌరవమైనా తను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే (2009-2018) జరిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘నా’టి పథకాలు అంటూ ‘నా’ అనే అక్షరాన్ని ప్రత్యేకించి చెబుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. అవే పథకాలకు రంగులు వేసి ‘గుమస్తా తెలంగాణ’ రాసిన రాతలు పచ్చి అబద్ధాలంటూ జీవోలతో సహా పోస్ట్ చేశారు. ‘నీ దత్తతలో (జనవరి 2019 తర్వాత) ఒక్క పథకమైనా వచ్చినట్టు పోలేపల్లి ఎల్లమ్మపై ఒట్టేసి ఆధారం (జీవో) చూపగలవా…!? కేటీఆర్’ అంటూ సవాల్ చేశారు.

* భాగ్యనగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది.! 2019లో ఈ భారీ స్కాం ఇప్పుడు పెను సంచలనమైంది. పూర్తి వివరాల్లోకెళితే.. నగరంలో బీహెచ్‌ఈఎల్‌లోని ఓ ఇంట్లో తమిళనాడు, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. భారీ బ్యాంక్ రాబరీ కేసులో సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నైలోని రూబీ గోల్డ్‌ స్కాంలో యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఇఫ్సర్‌ సోదరుడు అనీస్‌ రెహమాన్‌, షాపులో పనిచేసే మరో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తానని భారీగా ఆభరణాలు తీసుకుని దాదాపు 1500 మందిని రెహమాన్‌ మోసం చేసినట్లు తెలియవచ్చింది. మొత్తం రూ.300 కోట్లకు విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని ఇఫ్సర్‌ సేకరించినట్లు తేలింది. బంగారు విలువకు మూడొంతుల డబ్బు ఇస్తానని జనాలకు మాయమాటలు చెప్పి ఇతను నమ్మించాడు. దీంతో 1500 మంది తమ ఆభరణాలను రుణాల కోసం ఇచ్చారు. దీన్నే అదనుగా చేసుకున్న ఇప్సర్ ఈ భారీ ఆభరణాలతో అడ్రస్ లేకుండా పోయాడు.

* నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో అలజడికి పాక్‌లో కుట్ర జరిగిందని దిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం సుమారు 300 ట్విటర్‌ ఖాతాలు సృష్టించారని దిల్లీ ప్రత్యేక పోలీస్‌ కమిషనర్‌ (ఇంటిలిజెన్స్‌) దీపేంద్ర పాథక్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ట్రాక్టర్‌ ర్యాలీ జరగనుందని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,147 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 155 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,387కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,476 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

* ఓటరు ఐడీలను ఇకపై మొబైల్‌/ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్‌ వెర్షన్‌ ఓటరు గుర్తింపు కార్డులు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం (జనవరి 25) సందర్భంగా సోమవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వీటిని ఆవిష్కరించనున్నారు. ఈ డిజిటల్‌ ఓటరు గుర్తింపు కార్డును డిజిలాకర్‌లో పొందుపరచుకోవచ్చు. అలాగే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో ప్రింట్‌ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి.

* విదేశాలకు భారీగా మొబైల్‌ ఫోన్లను ఎగుమతి చేస్తున్న తరుణంలో దిగుమతి సుంకాలు అధికంగా ఉండటంలో అర్థం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. గ్రే మార్కెట్‌ను నివారించేందుకు మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాలను తగ్గించాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై వచ్చే బడ్జెట్‌లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని దేశీయ మొబైల్‌ మార్కెట్‌ రంగం కేంద్రాన్ని కోరుతోంది. 2021-22 బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.