Movies

జాన్వీకు రైతుల సెగ

జాన్వీకు రైతుల సెగ

జాన్వీకపూర్‌ షూటింగ్‌ ఆపి వెనక్కు వెళ్లిపోవాలని పంజాబ్‌ రైతులు నిరసన తెలిపారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ప్రభావం జాన్వీకపూర్‌ ప్రధాన పాత్రఽలో తెరకెక్కుతోన్న ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ చిత్రం షూటింగ్‌పై పడింది. పంజాబ్‌ పటియాలాలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా యూనిట్‌ను రైతులు చుట్టుముట్టారు. షూటింగ్‌ ఆపి వెనక్కు వెళ్లాలని సూచించారు. దీంతో జాన్వీకపూర్‌ షూటింగ్‌ ఆపి తాముంటున్న హోటల్‌కు తిరిగొచ్చారు. అక్కడకూ చేరుకున్న రైతులు హోటల్‌ ముందు ధర్నా చేశారు. ‘జాన్వీ వెనక్కు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు చేశారు. అధికారులు అక్కడకు చేరుకొని షూటింగ్‌ జరిగేలా ఒప్పించేందుకు రైతులతో చర్చిస్తున్నారు. నయనతార నటించిన ‘కొలమావు కోకిల’ తమిళ చిత్రానికి ఇది హిందీ రీమేక్‌.