ScienceAndTech

మోడీని తిట్టిన వీడియో కేసు FIRలో సుందర్ పిచయ్

ప్రధాని మోదీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్న ఓ వీడియో వాట్సప్‌, యూట్యూబ్‌లలో వచ్చిన వ్యవహారానికి సంబంధించి.. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, మరో ముగ్గురు గూగుల్‌ ఇండియా ఉన్నతాధికారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌ నుంచి తొలగించారు. ఇటీవల ప్రధాని మోదీ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉన్న ఓ వీడియోను వారణాసికి చెందిన ఓ వ్యక్తి ముందు వాట్సప్‌ గ్రూపుల్లోను, తర్వాత యూట్యూబ్‌లోను చూశారు. దానిపై అభ్యంతరం వ్యక్తం చేయగా తనకు 8,500 బెదిరింపు కాల్స్‌ వచ్చాయంటూ ఆయన భేలుపుర్‌ పోలీసులకు ఫిబ్రవరి 6న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తొలుత గూగుల్‌ ప్రతినిధులు సహా 17 మందిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన కేసులో సుందర్‌ పిచాయ్‌, ముగ్గురు గూగుల్‌ ఉన్నతాధికారుల ప్రమేయం లేదని గుర్తించడంతో వెంటనే వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌ నుంచి తొలగించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి వీడియోను రూపొందించినట్లు భావిస్తున్న గాజీపుర్‌ జిల్లాకు చెందిన సంగీత కళాకారుల పేర్లను మాత్రం ఎఫ్‌ఐఆర్‌లో ఉంచినట్లు చెప్పారు. ఈమేరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.