Health

నోరు చేదుగా ఉంటోందా?

నోరు చేదుగా ఉంటోందా?

చేదుగా ఉండటానికి రకరకాలకారణాలు దోహదం చేయొచ్చు. సహజంగానే వృద్ధాప్యంలో నాలుక మీదుండే రుచి మొగ్గల సంఖ్య తగ్గుతుంది. దీనికి తోడు లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దాహం వేస్తున్నవిషయాన్నీ సరిగా గుర్తించలేరు. ఫలితంగా నోరు పొడిబారుతుంది. అలాగే లాలాజలంలోనినీరు, ఖనిజ లవణాలు, జిగురుద్రవం, ఎంజైమ్‌ల మధ్య సమతుల్యత కూడా దెబ్బతినొచ్చు. దీంతో నోరు రుచి తగ్గుతుంది.చేదుగా అనిపిస్తుంటుంది. ఎండలోకి వెళితే నోటి చేదు ఎక్కువవుతుందని అంటున్నారుకాబట్టి మీ విషయంలో నోరు పొడిబారటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగాఎండలోకి వెళ్లినపుడు ఒంట్లో నీటిశాతం తగ్గుతుంది. చెమటతో పాటు ఖనిజ లవణాలు కూడాబయటకు వెళ్లిపోతాయి. నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో నోరు మరింతపొడిబారిపోయి, ఎక్కువగా చేదు అనిపిస్తుండొచ్చు. కాబట్టి బయటకు వెళ్లే ముందేతగినంత నీరు తాగేలా చూసుకోవాలి. కాస్త ఓఆర్‌ఎస్‌ పొడిని నీటిలో కలుపుకొని తాగితేఇంకా మంచిది. కొందరిలో జాగ్రన్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యలతోనూ లాలాజలం ఉత్పత్తితగ్గుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. చాలామందివృద్ధులు చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌, దంత సమస్యలను పెద్దగా పట్టించుకోరు.నోటి శుభ్రతను పాటించకపోయినా నోరు చేదుగా అనిపించొచ్చనే సంగతిని గుర్తించాలి.కాబట్టి వీలైనప్పుడల్లా ఓసారి దంత నిపుణులను కలిసి పరీక్షించుకోవాలి. నోరుశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చటం.. పొగాకు, జర్దా, ఖైనీ, గుట్కా వంటివి నమలటం వల్ల కూడా నోటిరుచి మారిపోవచ్చు. కాబట్టి సిగరెట్లు, బీడీలు తాగే అలవాటుంటే మానెయ్యాలి.పొగాకు, గుట్కాలకు దూరంగా ఉండాలి. జలుబు, సైనసైటిస్‌ వంటిసమస్యల్లోనూ నోటి రుచి దెబ్బతినొచ్చు. కొందరికి పులితేన్పులతోనూ (జీర్ణాశయంలోంచిఆమ్లం పైకి ఎగదన్నుకొని రావటం) రుచి మారిపోయి.. చేదుగా అనిపించొచ్చు. అందువల్లఇలాంటి సమస్యలేమైనా ఉంటే తగు చికిత్స తీసుకోవాలి. అంతేకాదు, ఏసీఈ ఇన్‌హిబిటార్స్‌ రకం బీపీ మందులతోనూ నోటి రుచి మారిపోవచ్చు.బీపీ మందులు వేసుకోవటం మొదలెట్టాక ఇలాంటి ఇబ్బంది మొదలైతే డాక్టర్‌ దృష్టికితీసుకెళ్లాలి. అవసరమైతే డాక్టర్‌ మందులు మార్చటం చేస్తారు.