Politics

పోలవరం ఎత్తు తగ్గించలేము సార్-తాజావార్తలు

Official Inform Jagan About Polavaram Height Reduction

* పోలవరం స్పిల్‌వే, అప్రోచ్‌ ఛానల్, కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్లపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.మే చివరికల్లా కాఫర్‌ డ్యాం పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.పోలవరం స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని పేర్కొన్నారు.అసంపూర్తిగా ఉన్న కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు.పోలవరం సహాయ పునరావాస కార్యక్రమాలపైనా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.పోలవరం ఎత్తు తగ్గింపు ప్రచారంపై సమావేశంలో చర్చ జరిగింది.పోలవరం ఎత్తు తగ్గించేందుకు అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు.సీడబ్ల్యూసీ కూడా ఇదే విషయం స్పష్టం చేసిందని జగన్​కు తెలిపారు.

* నేటి నుండి అభ్యర్థులకు షాక్…రేపటి నుంచి ప్రచారానికి ఐదు గరు మాత్రమే అనుమతి..ఎస్ఈసి నిమ్మగడ్డ ఉత్తర్వులు.5 గురు మించి అభ్యర్థుల వెంట ఉంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘనే.నేటి నుండి గట్టి నిఘా పెట్టాలని కలెక్టర్,ఎస్పీ,సీపీ లకు ఎస్ఈసి ఆదేశం.డబ్బు,మద్యం పై ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు.కోడ్ ఉల్లంగిస్తే కఠినమైన చర్యలు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై విచారణకు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ హైకోర్టులో 11 పిటిషన్లు దాఖలు అయ్యాయి.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పిటిషన్లు ఆరోపించారు.దీనిపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.కాగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే హైకోర్టుకు నివేదించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.గత ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా ఈ నెల 18న ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు.

* మరోసారి పెరిగిన వంటగ్యాస్‌ ధరలు!దిల్లీ: గ్యాస్‌ వినియోగదారులకు చమురు సంస్థలు మరోసారి షాకిచ్చాయి.వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పైనా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.95ను చమురు సంస్థలు పెంచాయి.పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని సోమవారం వెల్లడించాయి.వంటగ్యాస్‌పై డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు రూ.225 పెంచారు.డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కి పెంచారు.ఆ తర్వాత జనవరి 1న రూ.644 నుంచి రూ.694కు పెంచగా… ఫిబ్రవరి 4న మరోసారి రూ.644 నుంచి రూ.719కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఆ తర్వాత ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంట గ్యాస్‌పై రూ.25 వడ్డన విధించారు. దీంతో సిలిండర్‌ ధర రూ.769కి చేరడం గమనార్హం.

* రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అఖిలపక్ష సమావేశం ముగిసింది.ఎన్నికల నిర్వహణపై నేతల అభిప్రాయలను తెలుసుకున్నారు.సమావేశంలో నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎస్‌ఈసీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.ఎస్‌ఈసీ వ్యవహారశైలి మారకుంటే ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అసాధ్యమని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు.వలంటీర్లపై ఆంక్షలు విధించడం తగదని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు వైకాపా నేత నారాయణమూర్తి తెలిపారు.

* పురపాలిక ఎన్నికలంటే వైకాపాకు ఎందుకంత భయమని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు.’నా నియోజకవర్గానికి వెళ్లాలనుకుంటే అడ్డుకున్నారు. నాపై పెట్టిన కేసుల వివరాలు ఇవ్వాలని డీజీపీని కోరా.’అన్ని కేసులపై కలిపి క్వాష్ పిటిషన్ వేస్తా. నాపై జరిగే కుట్రలో తాడేపల్లివారు ఉన్నారని అనుమానం ఉంది.’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

* భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా టీకా వేయించుకున్నారు.చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో టీకా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు.28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోనున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రజలంతా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వెంకయ్య కోరారు.బిహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కొవిడ్ టీకాను తీసుకున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పట్నాలో టీకాను వేయించుకున్నారు.

* వేసవి సీజన్​(మార్చి-మే)లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.ఉత్తర భారతం​, ఈశాన్య భారతంలో ఎండలు అధికంగా ఉండనున్నాయని తెలిపింది.తూర్పు, పశ్చిమ భారత్​లోని కొన్ని ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది.దక్షిణ భారత్​, మధ్య భారత్​లో మాత్రం ఈ వేసవి సీజన్​లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

* కేంద్రానికి తమిళనాడు సంస్కృతి నచ్చదని కాంగ్రెస్​నేత రాహుల్​ గాంధీ అన్నారు.రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రం చెప్పుచేతల్లో పని చేసే సీఎం ఉన్నారని విమర్శలు చేశారు.తమిళనాడులో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారిలో నిర్వహించిన ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​.భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడటం తన బాధ్యత అని వెల్లడించారు.తమిళనాడు సీఎం పళనిస్వామి రాష్ట్ర అవసరాల కోసం కాకుండా.. మోదీ ఏం చెబితే అది చేస్తున్నారని ఆరోపించారు రాహుల్.మోదీ ముందు తలవంచే వాళ్లు తమిళనాడుకు న్యాయం చేయలేరని పేర్కొన్నారు.నాగర్​కోయిల్​కు వెళ్తూ మార్గ మధ్యంలో రాహుల్​ గాంధీ సహా తమిళనాడు కాంగ్రెస్​ నేతలు తాటి ముంజలు తిన్నారు. అక్కడి వారితో కాసేపు ముచ్చటించారు​.

* ఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల చర్చించారు. ‘వైఎస్సార్‌టీపీ’.. ‘వైఎస్సార్‌ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలించారు. మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.

* రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని పోలీసులు నిర్బంధించడాన్ని ఖండించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.