NRI-NRT

గురజాల నుండి అమెరికాకు బుల్లెట్లు తరలిస్తూ శంషాబాద్‌లో పట్టుబడ్డ ఎన్నారై దంపతులు-తాజావార్తలు

గురజాల నుండి అమెరికాకు బుల్లెట్లు తరలిస్తూ శంషాబాద్‌లో పట్టుబడ్డ ఎన్నారై దంపతులు-తాజావార్తలు

* శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం.గుంటూరు నుంచి అమెరికాకు వెళుతున్న దంపతుల బ్యాగుల్లో బుల్లెట్లు కనుగొన్న అధికారులు.హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది.అమెరికాకు వెళ్తున్న దంపతుల బ్యాగులో లభ్యమయ్యాయి. లగేజ్ స్కానింగ్ చేస్తుండగా బ్యాగ్‌లో బుల్లెట్లు కనిపించాయి.వాటిని కలిగి ఉన్న వారిని రాష్ట్రానికి చెందిన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ప్రయాణికులుగా గుర్తించారు.విచారణ కోసం దంపతులను పోలీసులకు అప్పగించారు విమానాశ్రయం అధికారులు..

* భారత మాజీ క్రికెటర్​ కపిల్​దేవ్​.. దిల్లీ ఓక్లా ప్రాంతంలోని ఫోర్టీస్ ఎస్కార్ట్స్​​ ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.

* పట్టణ ప్రాంతాల్లో మళ్లీ “అన్న క్యాంటీన్లు” ప్రారంభిస్తాం- అచ్చెన్నాయుడు. పేదప్రజలు ఆత్మగౌరంతో కడుపునిండా అతితక్కువ ఖర్చుతో ఆహరం తినేలా “అన్న క్యాంటీన్” లను టీడీపీ తిరిగి ప్రారంభిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు.పురపాలక ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రధాన వాగ్ధానం కూడా ఇదే.అన్నార్తుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, రూ.5కే పేదలకు కడుపునిండా భోజనం పెట్టేందుకు టీడీపీ కట్టుబడి ఉందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

* కర్నూలు నగరపాలిక 34, 35 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం.34 వార్డులో వెంకటేశ్వర్లు, 35వ వార్డులో మాధురి ఏకగ్రీవం.కడప: ప్రొద్దుటూరులోని 9 వార్డులు వైకాపా ఏకగ్రీవం.ప్రొద్దుటూరులోని మిగతా 32 వార్డులకు ఎన్నికలు.చిత్తూరు: పలమనేరు పురపాలక సంఘంలో 18 వార్డులు వైకాపా ఏకగ్రీవం.8 వార్డులకు మాత్రమే జరగనున్న ఎన్నికలు.పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం.ప్రత్యర్థుల నామినేషన్లు లేకపోవడంతో ఏకగ్రీవం.31 వార్డుల్లో కేవలం వైకాపా నుంచే బరిలో అభ్యర్థులు.గుంటూరు: పల్నాడు పురపాలిక ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల జోరు.మాచర్ల పురపాలికలో 31 వార్డుల్లో వైకాపా ఏకగ్రీవం.పిడుగురాళ్లలో 33 వార్డుల్లో వైకాపా అభ్యర్థుల ఏకగ్రీవం.ప్రకాశం: అద్దంకిలో నాటకీయ పరిణామాలు.8 వార్డులో వైకాపా, తెదేపా అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరణ.నామినేషన్ల ఉపసంహరణతో ఎన్నికలు జరగవన్న అధికారులు.

* గుంటూరు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ – ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు టిడిపి జాతీయ ప్రథాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

* భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు తిరుపతి, తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

* దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ టీకా తీసుకున్నారు.

* వామపక్షాలు ఈ నెల 5వ తేదీ పిలుపు నిచ్చిన రాష్ట్ర బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్.ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం నిర్ణయం మార్చుకోవాలి.రాష్ట్ర బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని శైలజానాధ్ పిలుపు.బంద్ ను జయప్రదం చేయడం ద్వారా విశాఖ ఉక్కు పై ఆంధ్ర ప్రజల హక్కు ను నిజం చేయాలి.

* తెనాలిలో వరుసగా అనారోగ్యానికి గురవుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు15 రోజుల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికులునిన్న తీవ్ర అనారోగ్యానికి గురై ఏడవ డివిజన్ పారిశుధ్య కార్మికుడు దుర్గా ప్రసాద్(30) మృతిఈరోజు ఉదయం వాంతులు విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ఏడవ డివిజన్ మరో సానిటరీ వర్కర్ నల్లగొర్ల రమణమ్మ.. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా గుంటూరు తరలించామని వైద్యుల సూచనతాజాగా కొద్దిసేపటి క్రితం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన మరో శానిటరీ వర్కర్ కాబోటి వెంకటలక్ష్మిపారిశుద్ధ్య కార్మికులు వరుసగా అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన చెందుతున్న వ్యాక్సిన్ వేయించుకున్న తోటి కార్మికులు

* ముంబైలో పలువురు సినీ నటుల ఇళ్లపై ఐటి దాడులు.డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి తాప్సి ఇళ్లల్లో ఐటి సోదాలు.నిర్మాణ సంస్థ ఫాంటోమ్ ఫిల్మ్స్ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు.ఫాంటోమ్ ఫిల్మ్స్ సంస్థతో సంబంధం ఉన్న దర్శకులు, నటుల ఇళ్లల్లో తనిఖీలు.

* సీఎం PRO తొలగింపు. ముఖ్యమంత్రి కేసీఆర్ PRO లలో ఒకరైన విజయకుమార్ గటిక ను PRO ఉద్యోగం తో పాటు, TRANSCO జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా తొలగించారు. అతని వ్యవహార శైలి,అతనిపై కొందరు TRS నాయకులు చేసిన ఫిర్యాదుపై విచారణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

* ఓ యువతిని లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్​ జర్కిహోళి.. తన పదవికి రాజీనామా చేశారు.

* రాజస్థాన్‌ జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) జవాన్ ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

* హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వ్యవసాయ రుణాల పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లోన్ ఇప్పిస్తామని లక్షలు దండుకున్నారు.

* మ‌య‌న్మార్‌లో నిర‌స‌న‌లు హింసాత్మ‌కంగా మారాయి. సైనిక తిరుగుబాటును వ్య‌తిరేకిస్తూ అక్క‌డ ఆందోళ‌న‌కారులు ఉద్య‌మిస్తున్నారు. ఇవాళ జ‌రిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు.