NRI-NRT

నాబార్డ్ ఛైర్మన్‌కు రామినేని ఫౌండేషన్ సన్మానం

నాబార్డ్ ఛైర్మన్‌కు రామినేని ఫౌండేషన్ సన్మానం

రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డ్ ఛైర్మన్ గోవిందరాజులు ఘనంగా సత్కరించారు. బ్రాహ్మణ కోడూరు గ్రామానికి విచ్చేసిన ఆయనకు రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణంలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాబార్డ్ చైర్మన్ గ్రామంలోని శివాలయం ,రామాలయం సందర్శించి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ స్వామి, రఘునాథ్ బాబు, నాబార్డ్ సీజీఎం సుధీర్ కుమార్, రామకృష్ణ, గ్రామ సర్పంచ్ అశోక్ మరియు మాజీ సర్పంచ్ రామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నాబార్డ్ ఛైర్మన్‌కు రామినేని ఫౌండేషన్ సన్మానం-USA Ramineni Foundation Felicitates Nabard Chairman Govindarajulu