NRI-NRT

వల్లేపల్లి శశికాంత్‌కు పితృవియోగం

TANA Foundation Secretary Vallepalli Sasikanth's Father Passes Away

తానా ఫౌండేషన్ కోశాధికారి, ప్రముఖ ప్రవాసాంధ్రుడు వల్లేపల్లి శశికాంత్ తండ్రి వల్లేపల్లి మోహనరావు మంగళవారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మోహనరావు జర్నలిస్టుగా, హోటల్ నిర్వాహకుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను గుడివాడతో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. మోహనరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మోహనరావు అంత్యక్రియలు బుధవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. పలువురు ప్రవాసాంధ్రులు శశికాంత్‌ను పరామర్శించారు.