Politics

రేపు జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్?-తాజావార్తలు

ZPTC MPTC Schedule To Be Released Tomorrow In AP

* ఏపీలో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ – ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న ఫలితాలు – ఏపీ నూతన ఎస్‍ఈసీగా నీలం సాహ్ని రేపు ప్రమాణస్వీకారం – ప్రమాణస్వీకారం తర్వాత షెడ్యూల్ విడుదల చేసే అవకాశం

* అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏ సీఎం అయినా సంతోషిస్తారు కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలపై దాడులు చేసి ఆనందిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

* ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడంలేదు. కొన్ని వారాల కిందట ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉంది.కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైగా నమోదవుతోంది.గడచిన 24 గంటల్లో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణా జిల్లాలో 113 కేసులు గుర్తించారు.అదే సమయంలో 456 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు.వారిలో చిత్తూరు జిల్లాకు చెందినవారు ముగ్గురున్నారు.ఇక, ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,01,989కి పెరిగింది.

* కరోనా అనంతర పరిస్థితులు, పరిణామాలను ఐ.టీ రంగంలో అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు విజయవాడ వేదికగా ఐ.టీ సంస్థల సీఈవోలతో ఏప్రిల్ 2న రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలోని ఐ.టీ సమావేశ మందిరంలో బుధవారం మంత్రి మేకపాటి అధ్యక్షతన ఐ.టీ శాఖపై సమీక్ష సమావేశం జరిగింది. ఐ.టీ సంస్థలకు చెల్లించవలసిన బకాయిల గురించి ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి ప్రధానంగా చర్చించారు. ఐ.టీ సంస్థలకు ఇవ్వవలసిన పెండింగ్ ఇన్సెంటివ్స్ లో మంజూరు కావలసిన క్లెయిమ్ లు, విడుదల చేయవలసినవాటి వివరాలను మంత్రి మేకపాటి ఆరా తీశారు. 2018 నుంచి 2021 వరకూ ఏపీఈఐటీఏ పరిధిలో ఉన్న ప్రోత్సాహక బకాయిల మొత్తం రూ.21.18 కోట్లుగా ఉన్నట్లు ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ మంత్రికి వివరించారు. గత ప్రభుత్వ ప్రోత్సాహక బకాయిలు 207 క్లెయిమ్ లకు రూ.49 కోట్లు బకాయిలున్నాయని మంత్రి మేకపాటికి ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ వివరించారు. అది కాకుండా గత రెండేళ్ల బకాయిలు 67 క్లెయిమ్ లకు మరో 11 కోట్లుగా ఉన్నట్లు ఆయన మంత్రి మేకపాటి దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధి, లీజ్ రెంటల్, విద్యుత్ రాయితీ,స్టాంప్ డ్యూటీ, డీటీపీ రెంటల్ సబ్సిడీల వారీగా క్లెయిమ్ లకు ఇవ్వవలసిన మొత్తాన్ని వేర్వేరుగా మంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు. ఐ.టీ ప్రోత్సాహకాలు సీఎఫ్ఎమ్ఎస్ పరిధిలో 142 క్లెయిమ్ లకు గానూ సుమారు రూ.24 కోట్లుగా ఉన్నట్లు ఐ.టీ అధికారులు మంత్రికి తెలిపారు.

* కొత్త సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఏప్రిల్ 5న దీనిని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.ఈ కమిటీ సభ్యుడు, వ్యవసాయ ఆర్థికవేత్త అనిల్ ఘన్వత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త సాగు చట్టాలపై నివేదికను రూపొందించి, మార్చి 19న సీల్డ్ కవర్లో పెట్టి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించినట్లు తెలిపారు.ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందువల్ల మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది నవంబరు చివరి నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాడుతున్న సంగతి తెలిసిందే.

* అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ బుధవారం గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.అసోం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా.. తాము ఇచ్చిన ఐదు హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాహుల్ స్పష్టం చేశారు.తమది భారతీయ జనతా పార్టీ కాదని.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.తేయాకు కార్మికులకు రోజూ వారీ వేతనం రూ.365 చెల్లిస్తామని చెప్పారు.

* కరోనా టీకా కొవిషీల్డ్​ను… తయారైనప్పటి నుంచి 9నెలల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చని భారత ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.

* తమిళనాట ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కోడలు శ్రీనిధి కార్తీ చిదంబరం వీడియోను ఉపయోగించింది భాజపా.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా.. తొలగించింది. దీనిపై శ్రీనిధి సహా కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు.

* సీఎం జగన్ కార్యక్రమం నేపథ్యంలో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి.శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా విజయవాడ వారధిపై గంటకుపైగా రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.విజయవాడ, గుంటూరు మధ్య వచ్చే వాహనాలన్నీ ప్రకాశం బ్యారేజ్ మీదుగా మళ్లించారు.బ్యారేజ్ మీదకు వాహనాలను మళ్లించడంతో ప్రకాశం బ్యారేజ్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది.కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.ట్రాఫిక్ వలయంలో పలువురు వీఐపీలు, రాజకీయ నేతలు చిక్కుకుపోయారు.సాక్షాత్తు సీఎం పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కూడా బ్యారేజ్‌పై ట్రాఫిక్‌ దిగ్బంధనంలో ఉండిపోయాయి.