DailyDose

హైదరాబాద్‌లో ₹3200కోట్ల నల్లధనం-నేరవార్తలు

హైదరాబాద్‌లో ₹3200కోట్ల నల్లధనం-వాణిజ్యం

* హైదరాబాదులో భారీగా బయటపడుతున్న బ్లాక్‌మనీ.రెండు వారాల్లోనే రూ.3,200 కోట్లు గుర్తించిన ఐటీ..ఓ ఫార్మా కంపెనీతోపాటు రియల్‌ ఎస్టేట్ కంపెనీల్లో బ్లాక్‌మనీ..10 రోజుల క్రితం ఫార్మా కంపెనీలో నిర్వహించిన సోదాల్లో రూ.రెండు వేల కోట్ల బ్లాక్‌మనీ లావాదేవీలు గుర్తించారు.తాజాగా రెండు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో బ్లాక్‌మనీ లావాదేవీలు వెలుగుచూశాయి.హైదరాబాద్‌కు చెందిన స్పెట్రా, సన్‌సిటీ కంపెనీల్లో నిర్వహించిన ఐటీ సోదాల్లో రూ.700 కోట్ల బ్లాక్‌మనీ లావాదేవీలు ఐటీ గుర్తించింది.బ్లాక్‌మనీ లావాదేవీల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు తయారుచేసుకున్నాయి.యాదాద్రి తదితర ప్రాంతాల్లో భారీగా కంపెనీలు వెంచర్లు వేశాయి.వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన రెండు కంపెనీల లావాదేవీలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

* శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని బాలుర వసతిగృహం ఐ బ్లాక్ సమీపంలో విద్యార్థులతో అతి దగ్గరగా ఉన్న చెత్త కుప్పలో బుధవారం రాత్రి 10. 45 గంటల సమయంలో నాటు బాంబు పేలింది. తిరుపతి సమీపంలోని కొందరు వ్యక్తులు అడివి పందులు అడవి జంతువుల కోసం నాటు బాంబు ను కొబ్బరిచిప్పలలో ఏర్పాటుచేసి చెత్త కుప్పలు సముదాయాలలో ఉంచినట్లు సమాచారం. నాటు బాంబు పేలి ఒక అడవి పంది చనిపోయింది. దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఒక కుక్క కూడా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే హెచ్ బ్లాక్ విద్యార్థులు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఉదయం హెచ్ బ్లాక్ సమీపంలో దుర్ఘటనపై పోలీసులు స్పందించి నాటు బాంబులతో అడవి పందుల వేట ఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు సమాచారం. నాటు బాంబులు తయారు చేసే వ్యక్తులను విచారిస్తున్నారు. ఇంకా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఏదైనా ప్రాంతంలో నాటుబాంబులు దొరుకుతాయేమో అనే ముందు జాగ్రత్త చర్యగా ఎస్పీ, డి.ఎస్.పి, ఎస్ఐలు డాగ్ స్క్వాడ్ బృందంతో పూర్తిస్థాయిలో వర్సిటీ మొత్తం తనిఖీలు చేస్తున్నారు. దీనిపై వర్సిటీ వీసీ రాజా రెడ్డి స్పందిస్తూ దీనిపై విస్తృతంగా కమిటీలు వేసి చర్చించి వర్సిటీ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేస్తామని అన్నారు.

* ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం ఎన్ఐఏ సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. సోదాలపై ఎన్ఐఈ నేడు ఓ ప్రకటన చేసింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు వెల్లడించింది. ఏపీలో శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పు గోదావరి, కర్నూలు, కడప, కృష్ణా, గుంటూరు… తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో సోదాలు చేసినట్టు వివరించింది. ఈ సోదాల్లో 40 మొబైల్ ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్ డిస్కులు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్ లు, ఒక ఆడియో రికార్డర్, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇవే కాకుండా కొన్ని ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. కాగా, మావోయిస్టు సానుభూతిపరులు, విప్లవ సంఘాల నేతలు, వారి సంబంధీకుల ఇళ్లలో ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

* హైదరాబాద్ నగరానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి షా నవాజ్ ఖాసీం భార్య హీనాకు కోవిడ్ వ్యాక్సిన్ వికటించింది. కింగ్ కోఠీలోని ఏరియా ఆస్పత్రిలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న హీనాను పరామర్శించి.. ఆమె పరిస్థితి, వైద్య సేవలపై ఆరాతీశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

* అగ్రరాజ్యం అమెరికా కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్‌ సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. బుధవారం జరిగిన ఈ కాల్పుల్లో చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. దీంతో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి.దక్షిణ కాలిఫోర్నియా ఆరెంజ్‌ సిటీలోని లికోయిన్‌ అవెన్యూ ఆఫీస్‌ భవనం రెండవ అంతస్తులో షూటింగ్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారి జెన్నిఫర్‌ అమాత్ తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారన్నారు. పోలీసు అధికారులు అనుమానుతుడిపై జరిపిన కాల్పుల్లో స్వల్పంగా గాయపడ్డాడు. దీంతో అతనికి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ జెన్నిఫర్ అమత్ సూచించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.