NRI-NRT

బెహ్రెయిన్‌లో బట్టలు ఆరేస్తూ…తెలంగాణా వ్యక్తి మృతి

Kankanala Gangaram Telangana Guy Dead In Bahrain

ఉపాధి నిమిత్తం బహ్రెయిన్‌ వెళ్లిన ఓ వ్యక్తి మృతిచెందాడు. జగిత్యాల అర్బన్‌ మండలం మోతె గ్రామానికి చెందిన కంకుణాల గంగారం (52) ఉపాధి కోసం బహ్రెయిన్‌ దేశం వెళ్లాడు. అక్కడ భవనంపై దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డాడు. తీవ్రగాయాల పాలైన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు.ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారంతా బోరున విలపిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె, భార్య ఉన్నారు.