NRI-NRT

భారత ప్రయాణీకులపై మలేషియా నిషేధం

భారత ప్రయాణీకులపై మలేషియా నిషేధం

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో మలేసియా కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణికులు మలేషియాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. భారత్ నుంచి వచ్చే నౌకలపైనా కఠిన ఆంక్షలు విధించింది. రేపటి నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను అన్ని దేశీయ, అంతర్జాతీయ విమనాశ్రయాల అధికారులకు చేరవేసినట్టు రవాణా మంత్రి మీ కా సియోంగ్ తెలిపారు. కరోనా రెండో దశ వ్యాప్తి భారత్‌ను చిగురుటాకులా వణికిస్తోంది. దీనికితోడు ఆక్సిజన్, బెడ్ల కొరత వేధిస్తోంది. ప్రతి రోజూ లక్షలాది కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి పలు దేశాలు భారత విమానాల రాకపోకలను నిషేధించాయి. గత నెల 20 యూకే తన ట్రావెల్ బ్యాన్ జాబితాలో భారత్‌ను చేర్చింది. అలాగే, ఈ నెలలో న్యూజిలాండ్ కూడా భారత్ నుంచి వచ్చే తమ దేశ పౌరులు, భారతీయులు దేశంలో అడుగుపెట్టకుండా తాత్కాలిక నిషేధం విధించింది. హాంకాంగ్, ఇరాన్, యూఏఈ వంటి దేశాలు కూడా భారత విమానాలపై నిషేధం విధించాయి.