Kids

మీ చేతివ్రాతకు గణపతికి ఇది సంబంధం

మీ చేతివ్రాతకు గణపతికి ఇది సంబంధం

ప్రసిద్ధ పురాతత్వవేత్త లిపి పరిశోధకుడు అ.బ.వాలావర్కర్, ప్రఖ్యాత పురాతత్వవేత్త…లిపికారుడు పద్మశ్రీ వాకణ్ కర్ తమ పరిశోధనలలో లిపి జన్మస్థానం భారతదేశమని నిరూపించారు. ధ్వన్యాత్మకత (Phonics) ఆధారంగా లేఖ పరంపర భారత దేశంలో వేదకాలం నుంచి బాగా వాడుకలో ఉండి ప్రసిద్ధి చెందింది.
తమ వాదనకు బలంగా వారు అనేక పురాతత్వ సాక్ష్యాలను చూపారు.
ఒక అక్షరము ఒక సమయంలో ఒక ధ్వనికి పర్యాయవాచకంగా ఉంటుందని కానీ రోమన్ లిపి అధ్యయనం చేస్తే ఒక అక్షరం, ఒక ధ్వనికి పర్యాయవాచకంగా ఉంటుందని చెప్పలేమన్నారు రోమన్ రచయిత ఎరిక్ గిల్. Ough అనే ఈ నాలుగు అక్షరాలు ఏడు రకాలుగా ఉచ్చరించబడతాయి ..ఓహ్…అఫ్…ఆఫ్..ఆ, ఊ,ఔ, ఊ, ఆ… గిల్ తన సిద్ధాంతంగా ఒక సత్యాన్ని చెప్పాడు. మా రోమన్ అక్షరాలు ధ్వనియొక్క లేఖనానికి..ముద్రణకు సరిగ్గా ఉంటాయని చెప్పడం మూర్ఖత్వమే అవుతుందని గిల్ అన్నారు.
ఇక ఇదే విషయాన్ని పరిశీలిస్తే మన దేశంలో ధ్వన్యాత్మక లేఖన పరంపర యుగ యుగాలుగా ఉంది. మన ప్రాచీన వాఙ్మయంలో దీనికి సంబంధించి అనేక రుజువులు ఉన్నాయి. యుజుతైత్తరీయ సంహితలోని దేవతలకు సంబంధించిన ఒక కథ ఉంది. మాట్లాడిన తర్వాత…వాణి అదృశ్యమైపోతుంది. ఈ నిరాకారమైన మాటను సాకారం చేయడమేలా..? అని దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లారు. వాచంవ్యా కుర్వీత వాక్కుకు ఆకారం ఇవ్వండి అని కోరారు. అప్పుడు ఇంద్రుడు దీనికోసం నేను వాయువు సాయం తీసుకోవాలని అనగా..దేవతలు అందుకు సమ్మతించారు. అప్పుడు ఇంద్రుడు వాక్కుకు ఆకారమునిచ్చాడు. వాక్కు కు ఆకారమును ఇవ్వడమే లేఖనవిద్య.
లుప్తమైపోతున్న వేద శాఖలను కాపాడవలసిందిగా సనకాది సిద్ధులు శివుడిని ప్రార్థించారు. వారి ప్రార్థన నాలకించిన పరమ శివుడు అలౌకికమైన శివతాండవ నృత్యం చేస్తూ మధ్యలో తన ఢమరుకమును ఒకసారి తొమ్మిది సార్లు…మరొకసారి ఐదు సార్లు మ్రోగించాడు. దీని నుంచే 14 ధ్వనిసూత్రాలు వెలుబడ్డాయి. దీనినే మహేశ్వర సూత్రములని మన పెద్దలు అన్నారు.
14 మహేశ్వర సూత్రములు..అ..ఆ..ఇ..ఈ..రు..రూ..లు.. లూ , ఏ, ఐ ఓ, ఔ…ఈ సూత్రాల ఆధారంగా పాణిని మహర్షి… వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయిని రచించారు. ఆ గ్రంథమే ధ్వన్యాత్మక భాషను, దాని వికాసాన్ని శాస్త్రీయంగా ఉంచుతోంది. అటు వేదాల స్మరణను, శుద్ధత చిరస్థాయిగా ఉండడానికి మహర్షులు అనేక జటిల పఠన పద్ధతులను వికసింపజేశారు. అవి జటా, మాలా, శిఖా, రేఖా, దండ, రథ, ధ్వజ, ఘనపాఠ..ఈ వేదపఠన పద్ధతులు ఆ కాలంలో వ్రాత లేకుండా సురక్షితంగా ఉంచుట సాధ్యం అయ్యేపని కాదు.
మహాభారత కర్త వ్యాసమహర్షి మహాభారత రచనకు ఉపక్రమించినప్పుడు తాను చెబుతుంటే…రాసేందుకు గణేశుణ్ణి సర్మించారు .. అప్పుడు గణేశుడు ప్రత్యక్షమై మహా భారత కావ్యాన్ని తన చేతులతో వ్రాసారు. అంటే మనం పూజించే గణేశుడు ఆనాటి మూర్ధన్యలిపికారుడని అర్థం అవుతుంది. మన దేశంలో ధ్వనిశాస్త్రాన్ని అనుసరించి లిపి వికసించింది. కాల క్రమంలో లిపులు మార్పు చెందుతూవస్తున్నాయి. దీని ఆధారంగానే ధ్వనిశాస్త్రం యొక్క మూల సిద్ధాంతం ఏర్పడింది.
మానవుని శరీరంలోని ఐదు అవయవాల సాయంతో ధ్వని ఉత్పన్నమవుతుంది. దీని ఆధారంగానే అచ్చులు,హల్లులు ఏ అవయవసాయంతో ఉచ్చరిస్తామో..ఆ అవయవాన్ననుసరించి వర్గీకరించారు. అవి శ్యాస కంఠం నుంచి పలికే అక్షరాలను కంఠవ్యము, తాలవ్యములు, మూర్థన్యములు, దంత్యములు, ఓష్ఠ్యములు, మిశ్రిత అక్షరాలు,. ధ్వని శాస్త్రం నుంచి లిపి వికసింపబడింది. కాల క్రమంలో లిపులు మార్పు చెందుతున్నాయి. దీని ఆధారంగానే ధ్వని శాస్త్రం మూల సిద్ధాంతము ఏర్పడింది. ప్రఖ్యాత పురాతత్వవేత్త వాలావాల్కర్ ప్రాచీన ముద్రలతో లభించిన లిపులను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనము ద్వారా వారు మూలరూపంలో మహేశ్వరి లిపిగా పిలిచే వైదిక లిపి ఏర్పడినట్లు రుజువు చేశారు. కొద్దికాలం తర్వాత అదే బ్రాహ్మీలిపిగా…నాగరిలిపిగా అభివృద్ధి చెందింది. ప్రఖ్యాత లిపి శాస్త్రవేత్త వాకణ్ కర్ ఓ చార్టును కూడా తయారు చేశారు.
లిపి అభివృద్ధి క్రమము, పురాతత్వ రుజువులపై వాలావాల్కర్, శ్రీ వాకణ్ కర్ విస్తృత పరిశోధనలు చేశారు. తమ పరిశోధనల ఆధారంగా వారు అనేక ప్రతిపాదనలు చేశారు. వీరి ప్రతిపాదనలపై కేంద్ర మానవవనరుల శాఖ మాజీ మంత్రి….డాక్టర్ మురళీమనోహర్ జోషి లిపి విధాత గణేశ్ అనే వ్యాస పరంపరలో అనేక అంశాలను ప్రస్తావించారు. రుజువులను సైతం చూపించారు. అతి ప్రాచీన కాలం నుంచే భారత దేశంలో లిపి విద్య లేఖన కళ ఉందని ఆయన తెలిపారు. మన దేశంలోని లిపి…పూర్తిగా ధ్వనిశాస్త్రంపై ఆధారపడి తయారైంది. ఈ శాస్త్రీయ దృష్టి ప్రపంచంలోని ఏ ఇతర లిపులలోను లేదు.
బ్రిటీష్ మ్యూజియంలో…క్రీ.పూ. ఆరవ శతాబ్దానికి చెందిన బాబిలోనియాకు సంబంధించిన ముద్రలో కీలాక్షరలిపి…భారత్ కు చెందిన బ్రాహ్మీలిపి కలిసివున్నాయి. కీలాక్షరలిపిని పురాతత్వ..లిపి శాస్త్రవేత్తలు 1936లో మాత్రమే చదవగలిగినారు. మధ్యలోనున్న పంక్తిని తెలియని అజ్ఞాత లిపిగా వదిలివేశారు. అయితే మన దేశంలో పురాతత్వ లేఖనవేత్తగా పేరుగాంచిన వాలావాల్కర్ మాత్రమే ఈ అజ్ఞాతలిపిని చదివి చూపించారు.