Agriculture

ఈమె చేపల ప్రతినిధి

ఈమె చేపల ప్రతినిధి

పేద దేశాలు ఎదుర్కొంటున్న పోషక విలువల సమస్యకు చేపలే పరిష్కారమని అంటారు భారత సంతతికి చెందిన మహిళ, వరల్డ్‌ ఫుడ్‌ప్రైజ్‌ విజేత శకుంతల హరక్‌సింగ్‌ తిల్‌స్టెడ్‌. ‘భారత్‌లాంటి దేశాలలో చేపలకు కొదువ లేదు. చుట్టూ సముద్రం, కావలసినన్ని జలాశయాలు. ఈ జలవనరులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వాలు మల్టీ విటమిన్‌ టాబ్లెట్లకోసం కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ మొత్తాన్ని చేపల పెంపకానికి వినియోగిస్తే ఉపాధి లభిస్తుంది, ఆకలి సమస్యా తీరుతుంది. పోషక విలువల లోపం నుంచి కూడా బయట పడవచ్చు. చేపల్లోని సూక్ష్మ పోషకాలు, ఫ్యాటీ యాసిడ్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి’ అంటారు శకుంతల. ‘చిన్నప్పుడు అమ్మమ్మ వండిన చేపలకూరతో నేను ఆ రుచికి వీరాభిమానిని అయ్యాను. ఓసారి మా మావయ్యకు యూనివర్సిటీ గోల్డ్‌ మెడల్‌ వచ్చింది. పత్రికలవాళ్లు అమ్మమ్మనుకూడా ఇంటర్వ్యూ చేశారు. ‘నేను నా బిడ్డకు చిన్నప్పుడు రోజూ చేపలు పెట్టేదాన్ని. దీంతో తెలివితేటలు బాగా పెరిగాయి’ అని వాళ్లతో సగర్వంగా చెప్పిందామె. అమ్మమ్మ మాటలు అక్షరాలా నిజం. పోషక విలువలతో కూడిన ఆహారం తింటేనే మెదడు చురుకుగా ాపకాలనూ నెమరేసుకున్నారు.